AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నక్కతోక తొక్కి వచ్చినట్టున్నాడు.! రూ. 1600 పెట్టి కోట్లు కొట్టేశాడుగా

అదృష్టం ఎప్పుడు, ఎలా ఒక వ్యక్తికి వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ఓ ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మిచిగాన్‌లో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. ఆ తర్వాత జరిగిందిదే. వివరాలు ఇలా..

Viral: నక్కతోక తొక్కి వచ్చినట్టున్నాడు.! రూ. 1600 పెట్టి కోట్లు కొట్టేశాడుగా
Telugu News
Ravi Kiran
|

Updated on: Oct 04, 2025 | 8:52 AM

Share

హైరిస్క్.. హైరివార్డ్.! అటు స్టాక్ మార్కెట్ ఎలాగో.. ఇటు లాటరీ టికెట్లు కూడా అలానే. ఈ రెండూ హైరిస్క్, హైరివార్డు గేమ్స్ అనమాట. చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్లు కొంటుంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది టిక్కెట్లు కొంటే.. అందులో కొద్దిమందికే అదృష్టం వరిస్తుంది. సరిగ్గా ఇదే తరహ ఘటన ఓ వ్యక్తికి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మిచిగాన్‌లోని వేన్ కౌంటీకి చెందిన 32 ఏళ్ల వ్యక్తి జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. సరదా కోసం స్క్రాచ్ చేసిన టికెట్ ద్వారా లచ్చిందేవి తలుపు తట్టింది.

ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే

సదరు యువకుడు ఇటీవల కాంటన్ ప్రాంతంలోని మిచిగాన్ అవెన్యూలో ఉన్న ఫ్లేక్ ఫ్రెష్ మార్ట్ స్టోర్‌కి వెళ్లాడు. అక్కడ అతడు 100X గేమ్ కోసం పలు టికెట్లు కొన్నాడు. సాధారణంగా అతడు ఈ గేమ్ ఆడడు. కానీ ఆ రోజు ఏదో కారణంతో ఆడాలని అనుకున్నాడు. టికెట్లు కొన్నాడు. ఇక అదే అతడికి లక్ తెచ్చిపెట్టింది. టికెట్‌లో 11వ నెంబర్ రావడంతో అతడికి ఏకంగా 2 మిలియన్ల డాలర్ల జాక్ పాట్ తగిలింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 17 కోట్లు అనమాట. తనకు ఇంతటి పెద్ద బహుమతి రావడంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేవు. 20 డాలర్లతో టికెట్ కొంటే 2 మిలియన్ల డాలర్స్ ప్రైజ్ మనీ వచ్చిందని అన్నాడు. ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్న తర్వాత, అతడు ఆ డబ్బును తన, తన కుటుంబీకుల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!