AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ప్రియురాలిని డేటింగ్‌కు తీసుకెళ్లిన ప్రియుడు.. అతడు చేసిన పనికి ఆమె ఫ్యూజులు ఔట్.!

సహజంగా ప్రేమలో మునిగి తేలుతున్న జంటలు తరచూ డేటింగ్‌కు వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇది సర్వసాధారణం. తమకు నచ్చిన వ్యక్తితో..

Viral News: ప్రియురాలిని డేటింగ్‌కు తీసుకెళ్లిన ప్రియుడు.. అతడు చేసిన పనికి ఆమె ఫ్యూజులు ఔట్.!
Dating
Ravi Kiran
| Edited By: Phani CH|

Updated on: Nov 12, 2021 | 2:18 PM

Share

సహజంగా ప్రేమలో మునిగి తేలుతున్న జంటలు తరచూ డేటింగ్‌కు వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇది సర్వసాధారణం. తమకు నచ్చిన వ్యక్తితో ఓ డిన్నర్ డేట్.. ఇది ప్రతీ అమ్మాయికి ఇష్టమైన క్షణం అని చెప్పొచ్చు. ఎంతో ఆశపడి.. నచ్చిన డ్రెస్.. దానికి మ్యాచింగ్ జ్యులరీ.. ఇలా అమ్మాయిలు సర్వం సిద్దమవుతారు. అయితే కొన్నిసార్లు ఆ అమ్మాయి అనుకున్న దానికి విరుద్దంగా డిన్నర్ డేట్ జరిగితే.. అదెలా ఉంటుందో ఊహించలేం. సరిగ్గా ఇదే రీతిలో ఓ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో డిన్నర్ డేట్‌కు రెడీ అయిన ఓ యువతికి.. ఆమె బాయ్ ఫ్రెండ్ ఫ్యూజులు ఎగిరిపోయేలా షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..

కాలిఫోర్నియాకు చెందిన హెడీ బెర్బర్ అనే యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మొదటిసారి డేట్‌కు వెళ్లింది. హోటల్‌కి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రియుడు తనకు మాత్రమే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఆమెను ‘ఏమైనా తింటావా’ అని అడగకుండా.. ఇంచక్కా అతడు మాత్రమే ఫుడ్ లాగించాడు. ఇక ఈ విషయాన్ని హెడీ బెర్బర్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఇందుకు సంబంధించి ఆమె ఓ టిక్ టాక్ వీడియోను షేర్ చేసింది. ” తన ఎదురుగా ఉన్న ఖాళీ టేబుల్‌ను చూపిస్తూ.. జరిగిన ఘటనను పూర్తిగా వివరించింది. ఆ సమయంలో తన దగ్గర డబ్బులు కూడా లేవని చెప్పింది. అసలు ఇలాంటి వ్యక్తితో మరోసారి డేటింగ్‌కు వెళ్లాలా.? అని యూజర్లను అడిగింది.

కాగా, ఈ టిక్ టాక్ వీడియోకు ఇప్పటిదాకా 3.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ అమ్మాయికి ఇంతకన్నా మంచి వ్యక్తి దొరకుతాడని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘నీ ఫుడ్‌కు మరొకరు బిల్ చెల్లించాలని ఎందుకు అనుకుంటున్నావ్’ అంటూ వేరొకరు కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో షేర్ చేశారు.

Also Read:

మగ సింహంపై విరుచుకుపడ్డ రెండు ఆడ సింహాలు.. యుద్ధం మాములుగా లేదు.. చూస్తే షాకవుతారు!

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!

Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్ష‌న్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!

ధోని స్థానాన్ని భర్తీ చేసేది అతడే.! వచ్చే ఏడాది సీఎస్‌కే రిటైన్ చేసే ఆటగాళ్లు వీరే.!