AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క వర్షం పడని ఊరు.. ఎడారి కాదు..! పర్యాటకులకు అందమైన అద్భుతం.. ఎక్కడంటే..

ఈ భూమిపై ఇప్పటివరకు ఛేదించబడని వేలాది రహస్యాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా అనేక రహస్యాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అలాంటి షాకింగ్‌ విషయమే ఈ స్టోరీ కూడా. ఈ భూమిపై ఉన్న ఒక గ్రామం గురించి తెలిస్తే మీరు కూడ షాక్‌ అవుతారు.. దాని గురించి తెలుసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు.. మీరు నివసించే చోట వర్షం లేకపోతే జీవితం ఎంత కష్టతరం అవుతుందో ఊహించుకోండి. కానీ, అలాంటి గ్రామమే ఇది. ఈ ఊరు ఇప్పటివరకు వర్షాన్ని చూడలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చుక్క వర్షం పడని ఊరు.. ఎడారి కాదు..! పర్యాటకులకు అందమైన అద్భుతం.. ఎక్కడంటే..
Al Hutaib Gaon
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2025 | 9:52 PM

Share

ఈ భూమిపై ఇప్పటివరకు ఛేదించబడని వేలాది రహస్యాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా అనేక రహస్యాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అలాంటి షాకింగ్‌ విషయమే ఈ స్టోరీ కూడా. ఈ భూమిపై ఉన్న ఒక గ్రామం గురించి తెలిస్తే మీరు కూడ షాక్‌ అవుతారు.. దాని గురించి తెలుసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు.. మీరు నివసించే చోట వర్షం లేకపోతే జీవితం ఎంత కష్టతరం అవుతుందో ఊహించుకోండి. కానీ, అలాంటి గ్రామమే ఇది. ఈ ఊరు ఇప్పటివరకు వర్షాన్ని చూడలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రామం ఏ ఎడారిలోనూ లేదు. ఈ గ్రామం పేరు అల్-హుతైబ్. ఇది యెమెన్ రాజధాని సనాలో ఉంది. అల్-హుతైబ్ గ్రామం రాజధాని సనాకు పశ్చిమాన మనఖ్ డైరెక్టరేట్ సమీపంలోని హర్జా ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశం పర్యాటకులకు కేంద్రంగా ఉంది. ఇక్కడికి వచ్చే ప్రజలు అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదిస్తారు. అయితే, ఇప్పటివరకు ఈ గ్రామంలో ఎప్పుడూ వర్షం పడలేదు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని వెనుక ఉన్న కారణం.

ఈ గ్రామం ఒక పర్వత శిఖరంపై ఉంది. ఇక్కడ అందమైన ఇళ్ళు నిర్మించారు. భూమి ఉపరితలం నుండి 3,200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రామం సహజ సౌందర్యాన్ని కలిగి ఉంది. శీతాకాలంలో ఉదయం పూట ఈ గ్రామం చాలా చల్లగా ఉంటుంది. అయితే, సూర్యుడు ఉదయించగానే వేడి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ గ్రామం అల్-బోహ్రా లేదా అల్-ముకర్రమా ప్రజలకు నిలయం. యెమెన్ నుండి వచ్చిన ఈ ప్రజలు ముహమ్మద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలోని ఇస్మాయిలీ (ముస్లిం) శాఖకు చెందినవారు. ఈ గ్రామం మేఘాల పైన ఉందని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.. గ్రామానికి నేరుగా కింద మేఘాలు ఏర్పడతాయి. అందుకే దిగువ ప్రాంతాలలో వర్షం పడుతుంది. కానీ గ్రామంలో ఒక్క చుక్క కూడా పడదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..