మూడేళ్లుగా టెంట్లోనే నిద్రించి నిధులు సేకరించి రికార్డు సాధించిన బాలుడు..ఇలా ఎందుకు చేశాడంటే
కొంతమందికి క్యాంపింగ్ చేయడం అలవాటుంది. వివిధ ప్రదేశాలకు వెళ్లి సరదాగా అక్కడ గడుపుతుంటారు. అయితే బ్రిటన్ లోని ఓ బాలుడు సుమారు మూడేళ్ల పాటు క్యాంపింగ్ చేసి నార్త్ డెవాన్ హోస్పైస్ అనే ఛారిటీ కోసం సుమారు రూ 7.6 నిధులు సేకరించాడు.

కొంతమందికి క్యాంపింగ్ చేయడం అలవాటుంది. వివిధ ప్రదేశాలకు వెళ్లి సరదాగా అక్కడ గడుపుతుంటారు. అయితే బ్రిటన్ లోని ఓ బాలుడు సుమారు మూడేళ్ల పాటు క్యాంపింగ్ చేసి నార్త్ డెవాన్ హోస్పైస్ అనే ఛారిటీ కోసం సుమారు రూ 7.6 నిధులు సేకరించాడు. వివరాల్లోకి వెళ్తే మ్యాక్స్ వూసే అనే బాలుడు యూకేలో ఉంటున్నాడు. అయితే ప్రమాదవశాత్తు పొరిగింట్లో ఉండే తన కుటుంబ స్నేహితుడు రిక్ అబాట్ 2020 ఫిబ్రవరిలో క్యాన్సర్ తో చనిపోయాడు. రిక్ ను బతికించేందుకు వూసే కుటుంబం కూడా సహాయం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్నేహితుడి మరణాన్ని చూసి తట్టుకేలేక పోయిన వూసే ఏదైనా మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
2020 మార్చిలో వూసే తన క్యాంపింగ్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 10 ఏళ్ల వయసులోనే వివిధ ప్రదేశాల్లో క్యాంపింగ్ చేస్తూ నిధులు సేకరించడం ప్రారంభించాడు. అయితే మూడేళ్ల ప్రయాణంలో వూసే ఎన్నో ఒడిదోడుకులు ఎదుర్కొన్నాడు. వర్షాలు, తుపానులు, కరోనా, హీట్ వేవ్ లాంటి ఎన్నో సవాళ్లను దాటాడు.ఒకసారి తన టెంట్ కూడా కూలిపోయినట్లు వూసే తెలిపాడు. అలాగే మూడేళ్ల ప్రయాణంలో గొప్ప వ్యక్తులను కలిసానని.. క్యాంపింగ్ చేస్తూ నిధులు సేకరించడం ఓ మంచి అనుభూతినిచ్చిందని తెలిపాడు. తన కుటుంబ స్నేహితుడు క్యాన్సర్ చో చనిపోయే ముందు తనకు ఈ టెంట్ ఇచ్చి.. ఎదైనా సాహసం చేయమని చెప్పాడని తెలిపాడు. నార్త్ డెవాన్ హోస్పైస్ అనే ఛారిటీ అతన్ని జాగ్రత్తగా చూసుకున్నారని.. వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు.. అలాగే ఈ పని చేయాలని నిర్ణయించుకున్నట్లు వూసే తెలిపాడు. క్యాంపింగ్ చేస్తూ ఎక్కువ నిధులు సేకరించిన వ్యక్తిగా వూసే గిన్నీస్ రికార్డు కూడా సాధించాడు. ఇక 2023 ఏప్రిల్ లో అతని క్యాంపింగ్ ని ఆపేసి.. తనకిష్టమైన రగ్బీ ఆటపై దృష్టి పెట్టనున్నాడు. తన స్నేహితుని కోసం ఈ పని చేసిన వూసేను నెటీజన్లు ప్రశంసిస్తున్నారు
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..




