దారుణం.. నడవలేని మామను ఆ కోడలు ఏంచేసిందంటే..

దారుణం.. నడవలేని మామను ఆ కోడలు ఏంచేసిందంటే..

Phani CH

|

Updated on: Mar 31, 2023 | 6:23 PM

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్‌ శివారు ప్రాంతానికి చెందిన విపిన్‌ ఓజా అనే వృద్ధుడు సైకిల్‌పై వెళ్తుండగా కిందపడిపోయాడు.

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్‌ శివారు ప్రాంతానికి చెందిన విపిన్‌ ఓజా అనే వృద్ధుడు సైకిల్‌పై వెళ్తుండగా కిందపడిపోయాడు. దాంతో అతడి కుడికాలు విరిగిపోయింది. కాలునొప్పితో అవస్థ పడుతున్న వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది అతడి కోడలు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని తరలించేందుకు ఆస్పత్రిలో స్ట్రెచర్ కనిపించకపోవడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. దిక్కుతోచని స్థితిలో ఒక బెడ్‌షీట్‌పై వృద్ధుడిని కూర్చోబెట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తవ్వేకొద్ది బయటపడుతున్న వేలాది గొర్రెల తలలు !!

ఏకంగా 150 సార్లు కరిచిన కుక్క- అయినా విడిచిపెట్టని యజమాని

అదనపు కట్నం అడిగిన వరునికి దిమ్మదిరిగే షాక్‌ !!

మహానటి !! సీరియల్లో యాక్టింగ్‌ వద్దన్న భర్తకు చావు చూపించింది

Dasara: దంచికొడుతున్న దసరా.. అప్పుడే 47కోట్ల రికార్డ్‌ బిజినెస్

 

Published on: Mar 31, 2023 06:23 PM