Cobras Fight: 2 నాగుపాములు పోట్లాడుకుంటే ఎట్టా ఉంటుందో తెల్సా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
మీరు నాగుపాముల సయ్యాటకు సంబంధించిన వీడియోలు తరచుగా చూస్తూనే ఉంటారు. కానీ 2 నాగుపాములు పోట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో తెల్సా..? మరి ఇంతకీ రెండింటిలో ఏది గెలిచింది..? ఎంత సేపు ఈ ఫైట్ సాగింది. ఆసక్తికర కథనం మీ కోసం ...

సోషల్ మీడియా రోజూ విభిన్నమైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆన్‌లైన్ యూజర్లను ఆకట్టుకునే అద్భుత దృశ్యాలు కొన్ని క్షణాల్లోనే వైరల్ అయిపోతాయి. ముఖ్యంగా వన్యప్రాణుల వీడియోలే ఈ మధ్యే నెట్టింట ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటిలోనూ పాములు వీడియోలకు ఓ రేంజ్ ట్రాక్షన్ ఉంటుంది. పాముల్లో నాగుపాము చాలా డేంజరస్ అన్న విషయం తెలిసిందే. తమకు అపాయం అనిపిస్తే అవి పడగవిప్పి విరుచుకుపడతాయి. అయితే మీరు పాములు మనుషులపై దాడి చేయడాన్ని చూసి ఉండొచ్చు. అలానే పాముల సయ్యాట వీడియోలు కూడా తరచూ కంటపడుతూ ఉంటాయి. కానీ… ఒక కోబ్రా మరో కింగ్ కోబ్రాపై దాడి చేయడం మాత్రం అత్యంత అరుదు. ఇలాంటి ఓ అరుదైన ఘట్టం కెమెరాకు చిక్కింది… ఇప్పుడు అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది!
వీడియోలో రెండు భారీ కోబ్రాలు ఒకదానికొకటి ఎదురుగా పడగవిప్పి నిలబడి ఉన్నాయి. ఒక్కసారిగా ఒక కోబ్రా తన పడగతో.. ఎదురుగా ఉన్న కోబ్రాపై దాడికి దిగుతుంది. దాంతో మరో కోబ్రా కూడా ఎదురుదాడికి దిగుతుంది. కొన్ని క్షణాల మాత్రం ఈ పోట్లాట జరిగింది. ఈ భీకరమైన పోరాటం చివర్లో ఏమి జరిగిందో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. మొదట ఇద్దరూ ఒకరినొకరు చంపుతారేమోనని అనిపించినా… ఫైనల్ టచ్ అలా లేదు. ఆ తర్వాత ఒక కోబ్రా అక్కడి నుంచి జారుకోవడం ఫైట్ ముగిసింది.
ఈ వీడియోను @sarpmitra_neerajprajapat అనే యూజర్ Xలో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 35 లక్షల మంది చూశారు. 10 లక్షల మంది లైక్ చేశారు. వీడియోపై వేలాది కామెంట్స్, రీ-ట్వీట్లు వస్తున్నాయి.
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
