Video: ఒక్కసారిగా రైలు నుంచి దూకి పరుగులు తీసిన ప్రయాణికులు! ఎందుకంటే..?
హసన్ నుండి షోలాపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో మరత్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం భయం తో ప్రయాణికులు భయాందోళనలకు గురై రైలు నుంచి దిగారు. మరమ్మత్తులు పూర్తి అయిన తర్వాత రైలు వెళ్లిపోయింది.
హసన్ నుండి షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా పొగలు వచ్చిన సంఘటన జిల్లాలోని షహాబాద్ తాలూకాలోని మరత్తూర్ స్టేషన్ సమీపంలో జరిగింది . సాంకేతిక లోపం కారణంగా రైలులో పొగలు వచ్చాయి. సిబ్బంది వెంటనే సిగ్నల్ చూపించి రైలును ఆపారు. బ్రేక్ బైండింగ్ లోపాన్ని సరిచేసిన తర్వాత రైలు వెళ్లింది. అయితే రైలు నుంచి పొగలు రావడంతో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెంది.. బయటికి పరుగులు తీశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
