MLA Ramulu Naik: “తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియాగాంధీకి థ్యాంక్స్”.. వైరల్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్

|

Aug 25, 2021 | 10:53 AM

ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ ప్రొగ్రామ్స్‌లో కొంతమంది నేతలు నోరు జారుతుంటారు. పక్కనున్న వారు అలెర్ట్‌ చేస్తే వెంటనే తేరుకొని కవర్ చేసుకుంటారు. అలా చాలామంది...

MLA Ramulu Naik: తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియాగాంధీకి థ్యాంక్స్.. వైరల్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్
Ramulu Naik
Follow us on

ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ ప్రొగ్రామ్స్‌లో కొంతమంది నేతలు నోరు జారుతుంటారు. పక్కనున్న వారు అలెర్ట్‌ చేస్తే వెంటనే తేరుకొని కవర్ చేసుకుంటారు. అలా చాలామంది కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే అలానే మాట్లాడి చర్చకు తావిచ్చారు . బహిరంగ సభలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ ప్రొగ్రామ్స్‌.. సందర్భం ఏదైనా మాట్లాడే నేతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ఇది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగి సెకన్లలో సీన్‌ అంతా వైరల్‌ అవుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారికి జాగ్రత్త అవసరం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, తెలంగాణలో ఓ ఎమ్మెల్యే కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని బోక్కలతండ గ్రామంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియాగాంధీకి థ్యాంక్స్ చెప్పాలంటూ కామెంట్స్ చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ సోనియా గాంధీని పొగడడంతో కార్యకర్తలు అవాక్కయ్యారు. ఆయన కావాలనే అలా మాట్లాడారో లేక అనుకోకుండా ఫ్లోలో మాట్లాడారో తెలియదు కానీ రాములునాయక్ కామెంట్స్‌ అటు జిల్లాలో, ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.

అయితే, రాములు నాయక్ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ను కొందరు సపోర్ట్‌ చేస్తుంటే, మరికొందరు తప్పుబడుతున్నారు. ఏదేమైనా, రాములు నాయక్ కామెంట్స్‌ ఇప్పుడు తెలంగాణలో వైరల్‌ అయ్యాయి.

“2014లో మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. అమ్మ సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆమెకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆమెకి కూడా తెలుసు. తెలంగాణ బిడ్డలు చాలా వివక్షకు గురవుతున్నారని. ఎడారి ప్రాంతంలో ఉన్నారు. వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగాల్లేవు. నిధులు లేవు, నియామకాలు లేవు. ఇవండీ మనకి ఈ మూడు నినాదాలివి. ఈ మూడింటిలో కూడా దగా పడుతున్నారని ఆమె కూడా గ్రహించి సంతకం పెట్టేసింది” అని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యాఖ్యానించారు.

Also Read: పెళ్లింట ఊహించని విషాదం.. మినీ ట్రక్ డోర్ విరిగి నలుగురు మృతి

టీవీ9 చేతిలో కోగంటి సత్యం రిమాండ్ రిపోర్ట్.. అందులోని కీలక విషయాలు ఇవే