Viral: విశ్వాసమంటే ఇదే.. యజమానిని కాపాడి ప్రాణాలొదిలిన మూగ జీవి.. రియల్ స్టోరీ వింటే కన్నీళ్లు పెడతారు..
కరెంట్ షాక్‌తో యజమాని కుప్పకూలగా.. అతన్ని కాపాడేందుకు గేదె పరుగులు తీసుకుంటూ వచ్చింది. అయితే.. చివరికి అదే కరేంట్ వైర్లు గేదెకు అంటుకోవడంతో

Loyal Buffalo Story: జంతువులలో ఎలాంటి కల్మషం ఉండదు. అలాంటి జంతువులను ప్రేమగా చూసుకుంటే.. అవి కూడా అంతే ప్రేమతో.. విశ్వాసంతో జీవితాంతం ఉంటాయి. మన భావాలను సైతం అర్ధం చేసుకుని.. ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనుకాడవు. అందుకే చాలామంది పెంపుడు జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. అలాంటి విశ్వాసమైన జంతువుల్లో శునకం ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఓ గేదె కూడా యజమాని ప్రాణాలను కాపాడి.. తనువుచాలించింది. కరెంట్ షాక్‌తో యజమాని కుప్పకూలగా.. అతన్ని కాపాడేందుకు గేదె పరుగులు తీసుకుంటూ వచ్చింది. అయితే.. చివరికి అదే కరేంట్ వైర్లు గేదెకు అంటుకోవడంతో ప్రాణాలు వదిలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో చోటుచేసుకోగా.. గేదె రియల్ స్టోరీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భదోహిలోని బాబుసరాయ్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల పరాస్ పటేల్ రాత్రి ఇంటి బయట మంచం మీద నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి అకస్మాత్తుగా వర్షం మొదలైంది. పరాస్ పటేల్ తన మంచంతో ఇంటి లోపలికి వెళ్లబోయాడు. ఆ సమయంలో విద్యుత్ తీగ కిందపడటంతో ఈ ఘటన జరిగింది.
కిందపడిన విద్యుత్ తీగను పరాస్ పటేల్ కర్రపై నుంచి తీసే ప్రయత్నం మొదలుపెట్టాడు. అయితే ఆ వైరు అతని శరీరానికి తాకింది. దీంతో పరాస్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన అతని కుమారుడు శివశంకర్ అక్కడికి చేరుకుని తండ్రిని రక్షించే ప్రయత్నం చేయబోయాడు. ఆ సమయంలో అతను కూడా షాక్‌కు గురై విలపించాడు. ఈ క్రమంలో గేదె పక్కనే కట్టేసి ఉంది.
తన యజమాని కష్టాల్లో ఉండటాన్ని చూసిన గేదె.. కట్టేసిన కర్రను పెకిలించుకొని శివశంకర్‌ని రక్షించడానికి పరిగెత్తింది. యజమానిని కాపాడే క్రమంలో అది కూడా తీగకు అంటుకుంది. అయితే పరుగున వచ్చిన గేదెను యాజమానిని నెట్టి.. ప్రాణాలు కోల్పోయింది. కాగా.. తీవ్ర గాయాలపాలైన శివశంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రాణాన్ని పణంగా పెట్టి యజమానిని కాపాడిన గేదె గురించి అంతటా చర్చనీయాంశంగా మారింది.




మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
