Viral Video: వామ్మో.. ఇంత పెద్ద అనకొండను జీవితంలో చూసుండరు.. సముద్రంలోకి వెళ్లిన స్కూబా డైవర్లకు..
అనకొండ మన ముందు తారసపడితే.. స్పందన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.. అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు స్కూబా డైవింగ్ కోసం సముద్రంలోకి ప్రవేశించారు.

Anaconda Video: ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం చాలారకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇవి చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. వాస్తవానికి అనకొండను మనం ఎప్పుడూ కూడా సినిమాల్లో చూస్తూనే ఉంటాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద.. అత్యంత ప్రమాదకరమైన పాము. సాధారణంగా అనకొండ మన ముందు తారసపడితే.. స్పందన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.. అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు స్కూబా డైవింగ్ కోసం సముద్రంలోకి ప్రవేశించారు. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రం లోతుకు వెళ్లిన వారికి ఊహించని షాక్ తగిలింది. వారి ముందు ఒక పెద్ద అనకొండ దర్శనం ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత పెద్ద అనకొండను సాధారణంగా ఎప్పుడూ చూసిఉండరు. సమాచారం ప్రకారం.. ఈ వీడియో బ్రెజిల్ కు చెందినది.
వైరల్ వీడియోలో ఇద్దరు స్నేహితులు డైవింగ్ సూట్లు ధరించి నీటి అడుగున వెళ్లడాన్ని వీడియోలో మీరు చూడవచ్చు. ఒక వ్యక్తి చేతిలో కెమెరా ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆకుపచ్చ రంగులో భారీ అనకొండ కనిపించింది. అనకొండ మెల్లగా వాళ్ళ వైపు రావడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరు షాకయ్యారు. వారు గజగజ వణుకుతూ.. అక్కడే ఉన్నారు. వాళ్ల వైపుగా వచ్చిన అనకొండ.. కెమెరా దగ్గరికి వచ్చి ఆగింది. నాలుకను బయటకు తీస్తూ కనిపించింది. సాధారణంగా అనకొండ ఆహారం సువాసనను పసిగట్టేందుకు ఇలా చేస్తుంది.
వీడియో చూడండి..




దీని తర్వాత అనకొండ తిరిగి వెళ్లడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. అదృష్టం ఏమిటంటే భారీ ఫైథాన్ ఎవరిపైనా దాడి చేయడు. వీడియోలో చూస్తుంటే అనకొండ ఎంత పెద్దదో అనిపిస్తుంది. అనకొండ 23 అడుగుల పొడవు ఉంటుందని, దాని బరువు 90 కిలోలు ఉంటుందని వారిలో ఒకరు చెప్పారు. అనకొండ కనిపించగానే.. కొంత సేపటి వరకు మౌనంగా ఉన్నామని వీడియోలో చెప్పారు. CGTN షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 46 లక్షల మందికి పైగా వీక్షించగా.. వేలాది మంది లైక్ చేసి కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
