AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 3 లక్షలు ఉన్న బ్యాగ్ కొట్టేసిన కోతి.. పోలీస్ స్టేషన్‌కు పంచాయతీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

కోతులు పరిసర ప్రాంతాలలో ఉంటే మనుషులకు ఎప్పుడూ తిప్పలే. అవి తింగరి పనులతో తెగ విసిగిస్తుంటాయి. చేతిలో ఏవి ఉంటే వాటిని లాగేసుకొని..

Viral News:  3 లక్షలు ఉన్న బ్యాగ్ కొట్టేసిన కోతి.. పోలీస్ స్టేషన్‌కు పంచాయతీ..  ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Monkey Took Money Bag
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 16, 2021 | 4:46 PM

కోతులు పరిసర ప్రాంతాలలో ఉంటే మనుషులకు ఎప్పుడూ తిప్పలే. అవి తింగరి పనులతో తెగ విసిగిస్తుంటాయి. చేతిలో ఏవి ఉంటే వాటిని లాగేసుకొని వెళ్లిపోతాయి. పల్లెటూర్లలో అయితే ఏకంగా ఇళ్లల్లోకే ప్రవేశించి నానా హడావిడి చేస్తాయి. పురుషులు గద్దిస్తే కాస్త బెదురుతాయి కానీ, మహిళలు అయితే కొన్ని కోతులు లెక్క కూడా చేయవు. కోతులు పరిసర ప్రాంతాలల్లో ఉంటే అది మాములు టెన్షన్ కాదు. కాగా తాజాగా ఓ కోతి చేసిన విచిత్రపని ఓ వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంతకీ కోతి చేసిన ఆ తింగరి పని ఏంటో తెలుసుకుందాం పదండి.

ఉత్తరప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలో సాండీ పోలిస్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన ఆశిష్ సింగ్ అనే వ్యక్తి  బైక్ నిలిపి ఉంచాడు. అయితే ఎట్నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ కోతి బైక్ వద్దకు వచ్చింది. బైక్‌ కవర్‌లో  ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకొని వెళ్లి చెట్టు మీద కూర్చుంది. ట్విస్ట్ ఏంటంటే.. ఆ బ్యాగ్‌లో 3 లక్షల రూపాయల నగదు ఉంది. అది గమనించిన బైక్ యజమాని బ్యాగ్‌ను దక్కించేందుకు నానా ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేదు.  దీంతో ఆగ్రహానికి లోనైన ఆశిష్ సింగ్ ఏం చెయ్యాలో తెలియక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అతడు అక్కడ్నుంచి వెళ్లగానే కోతి ఏమనుకుందో…ఏమో కానీ, మూడు లక్షలు ఉన్న బ్యాగ్‌ను కింద పడేసింది. దీనిని సమీపంలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు గమనించి, ఆ సొమ్మును తీసుకు వచ్చి పోలీసులకు అప్పగించారు. వారు ఆశిష్‌కు ఆ మొత్తాన్ని అందజేశారు. పోలీసులతో పాటు, ఆశిష్ ఆ సెక్యూరిటీ గార్డు నిజాయితీని మెచ్చుకున్నారు. కోతి చేతిలో పడింది..ఇక చేతికి రాదనుకున్న డబ్బు తిరిగి లభించటంతో..అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: రమ్య మర్డర్ వెనుక మిస్టరీ వీడింది.. కీలక విషయాలు వెల్లడించిన గుంటూరు డీఐజీ రాజశేఖర్‌బాబు

‘తలైవా’ ధోనిని కలిసేందుకు 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన ఫ్యాన్.. ఫైనల్‌గా..?

ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే