AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆన్‌లైన్‌లో ఫ్రిజ్ కొన్నాడు.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు.. కారణం తెలిస్తే షాకే.!

రాత్రికి రాత్రి లక్షాధికారులు, మిలినీయర్లుగా మారిన చాలామంది వ్యక్తుల కథలను మీరు వినే ఉంటారు. లాటరీ లేదా ఇంకేదైనా కారణం..

Viral News: ఆన్‌లైన్‌లో ఫ్రిజ్ కొన్నాడు.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు.. కారణం తెలిస్తే షాకే.!
Fridge
Ravi Kiran
|

Updated on: Aug 16, 2021 | 5:40 PM

Share

రాత్రికి రాత్రి లక్షాధికారులు, మిలినీయర్లుగా మారిన చాలామంది వ్యక్తుల కథలను మీరు వినే ఉంటారు. లాటరీ లేదా ఇంకేదైనా కారణం వల్ల వాళ్లు కోటీశ్వరులు కావచ్చు. అయితే ఓ ఫ్రిజ్ కారణంగా మిలినీయర్ కావడం మీరెప్పుడైనా విన్నారా.? కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండీ.! ఇప్పుడు చెప్పబోతున్న వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఓ ఫ్రిజ్ కారణం కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కొరియాలోని జెజు ద్వీప నివాసి ఆన్‌లైన్‌లో ఫ్రిడ్జ్ ఆర్డర్ ఇచ్చాడు. అది ఇంటికి డెలివరీ అయింది. ఇక ఆ ఫ్రిడ్జ్‌ను శుభ్రం చేస్తుండగా దిగువ భాగంలో ఓ అట్టముక్కకు టేప్ అతికించి ఉండటం గమనించాడు. దానిని తీయడంతో 1.30 లక్షల డాలర్ల (సుమారు 96 లక్షల రూపాయలు) విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. తద్వారా అతడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడుగా మారాడు. అయితే ఇదే సమయంలో సదరు వ్యక్తి ఆగష్టు 6వ తేదీన తన డబ్బు పోయినట్లుగా కంప్లయింట్ ఫైల్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో తెలియదు గానీ అక్కడి స్థానిక మీడియా మాత్రం ఈ విషయాన్ని వెల్లడించింది.

కాగా, మిలినీయర్ కావడం అటుంచితే.. ఫ్రిజ్ కింద దొరికిన రూ.96 లక్షలను సదురు వ్యక్తి  వెంటనే పోలీసులకు అప్పజెప్పాడు. అయితే దక్షిణ కొరియా చట్టం ప్రకారం, ఆ డబ్బును తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే.. ప్రభుత్వానికి 22 శాతం పన్ను చెల్లించి ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు. అలా కాదని ఎవరైనా వస్తే.. కొంత డబ్బు అతడికి పరిహారం రూపంలో వస్తుంది. ఇలా ఏది ఏమైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన ఫ్రిజ్ ద్వారా సదరు వ్యక్తి లక్షాధికారి అయ్యాడని చెప్పవచ్చు.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

 ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!

ఎనిమిదో స్థానంలో సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియాకు సూపర్ విక్టరీ.. గెలిపించిన బెస్ట్ ఆల్‌రౌండర్!

Follow Us
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..