Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: తవ్వకాల్లో దొరికిన భారీ నిధి..! మూత తెరిచి చూసిన జనం పరుగో పరుగు..!! ఏం జరిగిదంటే..

ఈ వీడియోను 50 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బంగారు నాణేలు దొరికాయని కొందరు చెబుతుండగా, ఇంత బంగారాన్ని ఏం చేస్తారు? ఈ నిధి మీకు ఎక్కడ దొరికింది? ఈ నిధి ఎంత పాతది? అంటూ మరికొందరు అడుగుతున్నారు. అయితే ఈ వీడియోపై కొందరు

Watch: తవ్వకాల్లో దొరికిన భారీ నిధి..! మూత తెరిచి చూసిన జనం పరుగో పరుగు..!! ఏం జరిగిదంటే..
Treasure Found With Snake
Jyothi Gadda
|

Updated on: Sep 12, 2024 | 6:19 PM

Share

నిధి చుట్టూ కాపాలగా పాములు ఉంటాయని చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ఈ క్రమంలోనే ఇటీవల ఒడిశాలోని పూరీలో జగన్నాథ ఆలయ ఖజానా తెరవడం సందర్భంగా నిపుణులైన స్నేక్‌ క్యాచర్స్ ని కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎంత నిధి దొరికిందన్న సమాచారం బయటకు రాలేదు. ఇదిలా ఉండగా నిధిలోంచి పాము బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూమిలో తవ్వకాలు జరుపుతుండగా, ఒక కూజవంటి పాత్ర సీల్‌ వేసి కనిపించింది. ఆ కుండకున్న మూత తెరిచి చూడగానే అందులోంచి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఇది చూసి అందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఈ వీడియో రెండు వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. వీడియోలో ఒక వ్యక్తి మెటల్ డిటెక్టర్‌తో సెర్చ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మెటల్ డిటెక్టర్ ఆ స్థలంలో ఏదో ఉన్నట్టుగా సూచించింది. వెంటనే ఆ వ్యక్తి అక్కడ నేలను త్రవ్వడం ప్రారంభిస్తాడు. కొంచెం లోతుగా తవ్విన వెంటనే కూజ లాంటిది అతనికి కనిపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి మట్టి నుండి కుండను బయటకు తీస్తాడు.

ఇవి కూడా చదవండి

దానికి ఉన్న ఇనుప మూత గట్టిగా మూసి ఉంది. మూత పైభాగంలో ఒక చిన్న రంధ్రం కూడా కనిపిస్తుంది. గట్టిగా మూసి ఉన్న మూత తెరవగానే లోపల నుంచి పాము బయటకు వస్తుంది. తర్వాత కుండలోంచి పామును బయటకు తీస్తారు. దీని తరువాత ఆ కుండలోంచి ఒక కప్పను బయటకు తీస్తారు. కప్ప తర్వాత పొడవాటి బంగారంలాంటి హారం ఒకటి కనిపించింది. దాన్ని కూడా బయటకు తీస్తారు. చివరకు కుండలో ఉంచిన నాణేలు బయట పడతాయి. కానీ, తొలుత పాము ఆ కూజలోంచి బయటకు రాగానే అక్కడున్న వారంతా ఒక్క క్షణం భయపడిపోయారు.

ఈ వీడియో చూడండి..

ఈ వీడియోను 50 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బంగారు నాణేలు దొరికాయని కొందరు చెబుతుండగా, ఇంత బంగారాన్ని ఏం చేస్తారు? ఈ నిధి మీకు ఎక్కడ దొరికింది? ఈ నిధి ఎంత పాతది? అంటూ మరికొందరు అడుగుతున్నారు. అయితే ఈ వీడియోపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పాక్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. పుట్టుకొచ్చిన మరో కొత్తపార్టీ!
పాక్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. పుట్టుకొచ్చిన మరో కొత్తపార్టీ!
కోహ్లీ, రోహిత్ 2027 ప్రపంచ కప్ ఆడతారా? బీసీసీఐ క్లారిటీ
కోహ్లీ, రోహిత్ 2027 ప్రపంచ కప్ ఆడతారా? బీసీసీఐ క్లారిటీ
Rajasthan CCTV Video: నడిరోడ్డుపై సినీ ఫక్కీలో సర్పంచ్‌పై దాడి...
Rajasthan CCTV Video: నడిరోడ్డుపై సినీ ఫక్కీలో సర్పంచ్‌పై దాడి...
APPSC 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు..
APPSC 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు..
భీముడు నిర్మించిన పరశుర సరస్సు నేటికీ లోటు ఎంతో కనిపెట్టని సైన్స్
భీముడు నిర్మించిన పరశుర సరస్సు నేటికీ లోటు ఎంతో కనిపెట్టని సైన్స్
అప్పట్లో కుర్రాళ్లను కవ్వించిన ఈ నటి గుర్తుందా.?
అప్పట్లో కుర్రాళ్లను కవ్వించిన ఈ నటి గుర్తుందా.?
సమంత,చిరంజీవి కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
సమంత,చిరంజీవి కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
సనత్ జయసూర్య జీవితంలో మూడు పెళ్లిళ్లు ఎందుకు ఫెయిలయ్యాయి ?
సనత్ జయసూర్య జీవితంలో మూడు పెళ్లిళ్లు ఎందుకు ఫెయిలయ్యాయి ?
ఇవాళ్టి నుంచి MBBS, MDS ప్రవేశాలకు 2025 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు
ఇవాళ్టి నుంచి MBBS, MDS ప్రవేశాలకు 2025 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు
రజనీ రేంజ్ అలాంటిది మరి.. కూలి ఓటీటీ డీల్ ఏకంగా అన్ని కోట్లా?
రజనీ రేంజ్ అలాంటిది మరి.. కూలి ఓటీటీ డీల్ ఏకంగా అన్ని కోట్లా?