AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జిరాఫీకి ఆహారం పెట్టేందుకు చిన్నోడి తాపత్రయం.. బుడ్డోడి అవస్థలు చూసి జిరాఫీ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..

పిల్లలు దేవుడితో సమానం అంటుంటారు. కల్మషం లేని మనసులు వారివి.. వారికి ఎది అనిపిస్తే అది చేసేస్తుంటారు. మంచి, చెడు, స్వార్థం అనే భావనలు వారిలో

Viral Video: జిరాఫీకి ఆహారం పెట్టేందుకు చిన్నోడి తాపత్రయం.. బుడ్డోడి అవస్థలు చూసి జిరాఫీ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2021 | 9:46 PM

Share

పిల్లలు దేవుడితో సమానం అంటుంటారు. కల్మషం లేని మనసులు వారివి.. వారికి ఎది అనిపిస్తే అది చేసేస్తుంటారు. మంచి, చెడు, స్వార్థం అనే భావనలు వారిలో అస్సలు ఉండవు. తమ దగ్గర ఉన్నవాటిని.. ఇతరులకు ఇచ్చేస్తుంటారు. ఇక జంతువులను చూస్తే వాటితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.. వాటిని మచ్చిక చేసుకుని తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని చిన్న పిల్లలు చేసే పనులు మనసుకు ఎంతో హాయినిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో వాళ్లు చేసే అల్లరి చేష్టలు చూస్తే… కోపంతో పాటు నవ్వు కూడా వస్తుంటుంది. అంత ముద్దుగా ఉంటాయి చిన్న పిల్లలు చేసే పనులు. కానీ కొన్నిసార్లు చిన్న పిల్లలు చేసే పనులు…వారు మాట్లాడే మాటలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో ప్రతి చిన్న వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో చిన్న పిల్లల అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు అనేకం ఉంటున్నాయి. అలసిపోయినా.. మనసు ప్రశాంతత కోల్పోయిన… ఒక్కసారి చిన్నపిల్లల అల్లరి చేష్టలు.. వారికి సంబంధించిన క్యూట్ వీడియోస్ చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంటుంది కదూ. తాజాగా ఓ బుడ్డొడి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో ఆ చిన్నోడి తాపత్రాయం చూస్తే మీరు ముగ్ధులవ్వడం ఖాయం..

అందులో ఓ జూపార్కుకు తన కుటుంబంతోపాటు ఒక చిన్న పిల్లాడు వెళ్లాడు. అక్కడున్న జంతువులను చూసి ఆ చిన్నోడు ఎంతో ముగ్దుడయ్యాడు. వెంటనే అక్కడే ఉన్న జిరాఫీకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నించాడు. ఒక చిన్న కొమ్మను పట్టుకుని జిరాఫీ ముందుకు వెళ్లి.. ఆ కొమ్మను దానికి అందించేందుకు ప్రయత్నించాడు. తలను పూర్తిగా వెనకు వంచి ఆ చిన్నోడు ఆ కొమ్మను జిరాఫీకి ఇచ్చేందుకు తెగ కష్టపడిపోయాడు. అయితే ఆ కొమ్మను తీసుకోవడానికి జిరాఫీ సైతం తలను కిందకు వచ్చింది. అయితే జిరాఫీ ఎత్తులో ఉండడం.. కొమ్మ ఇస్తున్న చిన్నోడు మరీ చిన్నగా ఉండిపోవడంతో.. కొమ్మ జిరాఫీకి అందలేదు. అయితే అలా చాలా సేపు ప్రయత్నించిన తర్వాత ఆ జిరాఫీ తన తలను దాని ముందున్న గ్రిల్స్ మధ్యలో నుంచి తల పెట్టి ఆ కొమ్మను అందుకుంది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఆ క్యూట్ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read: విమానంలో బిజినెస్ క్లాస్ సీట్ల కోసం ఎందుకు అంత డబ్బు చెల్లిస్తారో తెలుసా.. వాటి ప్రత్యేకతలు ఎంటో తెలుసుకోండి..

Viral Video: అలెక్సాకే వార్నింగ్ ఇస్తున్నా బామ్మ.. ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..వీడియో మీకోసం..