Cow’s Attack on Tiger: ఐకమత్యమే బలం.. కలిసి ఉంటే కలదు సుఖం.. ఇలాంటి మాటలు మనం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం. కేవలం వినడానికి, వల్లించడానికే కాదు ఇది ఆచరణసాధ్యం కూడా అని నిరూపించే సంఘటనలూ లేకపోలేదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియోలో ఓ గోవుల మంద పెద్దపులి బారినుంచి తమ తోటి గోవును ఎలా కాపాడుకున్నాయో చూస్తే ఐకమత్యంలో ఉన్న బలమేంటో తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆవుల మంద నుంచి కాస్త దూరంగా ఒంటరిగా ఉన్న ఓ ఆవుపైకి నక్కినక్కి వచ్చి దాడికి దిగింది ఓ పెద్దపులి. దీంతో ఆవు పెద్దగా అరవడంతో అది గమనించిన మిగతా ఆవుల మంద పరుగు పరుగున అక్కడికి వచ్చాయి. వాస్తవానికి ఆవుపై దాడిచేస్తున్న పులిని చూసి మిగతా ఆవులు భయంతో పారిపోవాలి.. కానీ అవి అలా చేయలేదు. తమ తోటి ప్రాణికోసం అండగా నిలిచాయి. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు ఉరికాయి.
అన్ని ఆవులూ కలిసి పులిపై దాడికి దిగాయి. అన్ని ఆవులు ఒక్కసారిగా దూసుకురావడంతో భయపడిన పులి పట్టుకున్న ఆవును అక్కడే వదిలి పొదల్లోకి పరుగు లంఘించుకుంది. అయితే పులి అక్కడే ఉండడంతో.. గాయపడిన ఆ ఆవును కాపాడేందుకు ప్లాన్ చేశాయి. దానిని మిగతా ఆవులన్నీ చుట్టుముట్టి మళ్లీ దాడికి దిగకుండా తెల్లవారే దాకా కాపలాగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి భోపాల్ కేర్వా శివారులోని ఓ డెయిరీ ఫామ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
संगठन में शक्ति है…
भोपाल के मदरबुल फार्म में बाघ ने एक गाय पर हमला किया तो उस गाय को बचाने दौड़ पड़ा गायों का झुंड।
देखिए वीडियो…#Bhopal #cows pic.twitter.com/678Gy4YyN2
— Upmita Vajpai (@upmita) June 20, 2023
అయితే.. గాయపడిన ఆ ఆవు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన వేలాదిమంది నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..