Watch: ఓరీ దేవుడో ఇదేం రద్దీరా సామీ..! వందేభారత్‌లో కూడా ఇదే సీన్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఈ వీడియోను ఇప్పటి వరకు 1.3 మిలియన్లు అంటే 13 లక్షల సార్లు వీక్షించగా, 17 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. వీడియో చూసిన కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అలాంటి ప్రయాణికులకు జరిమానా విధించాలని చెబుతున్నారు.
రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ప్రయాణికులకు మన దేశంలో కొరత లేదు. దాదాపు ప్రతి రైలులో, టిక్కెట్ లేకుండా ప్రయాణించే కొంతమంది ప్రయాణికులను చూస్తూనే ఉంటాం. టీటీ చెక్కింగ్‌కు వచ్చినప్పుడు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టేస్తుంటారు. లోకల్ రైళ్లలో ఇలాంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, ఇప్పుడు వందే భారత్ లాంటి రైళ్లలో కూడా టికెట్ లేకుండా ఎక్కి ప్రయాణించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? అవును, ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కిక్కిరిసిన జనం కనిపిస్తు్న్నారు. వీళ్లంతా టిక్కెట్ లేని ప్రయాణీకులే అని వాదిస్తున్నారు.
ఈ వీడియో @IndianTechGuide అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియో కేవలం 5 సెకన్లు మాత్రమే ఉంది. అయితే ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. రైలు కోచ్ ఎంత రద్దీగా ఉందో వీడియోలో చూడవచ్చు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్టేషన్‌లో ఆగి ఉన్న వందే భారత్ రైలు మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. సీట్లన్నీ ప్రయాణికులతో నిండిపోగా అనేక మంది సీట్ల మధ్య దారిలో కూడా నిలబడి ఉన్నారు. కనీసం కాలుపెట్టేందుకు కూడా స్థలం లేనంతగా రైలు ప్రయాణికులతో కిటకిటలాడింది. లఖ్నవూ జంక్షన్, డెహ్రాడూన్‌ల మధ్య నడిచే వందేభారత్‌లో ఈ దృశ్యం కనిపించిందని నెటిజన్లు చెబుతున్నారు.
🚨 Vande Bharat train occupied by ticketless passengers at Lucknow.
(📷-@architnagar) pic.twitter.com/ZnkQFr5iJs
— Indian Tech & Infra (@IndianTechGuide) June 11, 2024
ఈ వీడియోను ఇప్పటి వరకు 1.3 మిలియన్లు అంటే 13 లక్షల సార్లు వీక్షించగా, 17 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. వీడియో చూసిన కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అలాంటి ప్రయాణికులకు జరిమానా విధించాలని చెబుతున్నారు. అదే సమయంలో, ‘టికెట్ లేకుండా ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడికి కనీసం లక్ష జరిమానా విధించాలంటున్నారు.
Now Premium Vande Bharat is also facing the same fate as other trains.
We do not need a puppet Railway Minister, we need a new Railways which is at least accountable. pic.twitter.com/1V5NwiavQI
— Gems of Engineering (@gemsofbabus_) June 9, 2024
అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో, పోస్ట్‌పై రైల్వే శాఖ నుండి కూడా సమాధానం వచ్చింది. ఈ పోస్ట్‌పై రైల్వే సర్వీస్ స్పందిస్తూ, ‘మేము సహాయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. సంబంధిత అధికారులకు సమాచారం అందజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..