VIRAL VIDEO : దాదాపుగా సింహాలంటే మిగతా జంతువులు చాలా భయపడుతుంటాయి. అది ఎక్కడ దాడి చేసి చంపుతుందోనని ఆందోళన చెందుతుంటాయి. అలాంటిది.. ఒక నీటి ఏనుగు సింహాలకే చుక్కలు చూపించింది. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా మూడు సింహాలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ హిప్పోపొటమస్ దెబ్బకు సింహాలు మూడు బతుకు జీవుడా అన్నట్టుగా తలోదిక్కు తప్పించుకుని పారిపోయాయి. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో..మూడు సింహాలు ఓ నీటి కొలను దాటుతున్నాయి. అయితే, అంతలోనే నీటి ఒడ్డున నిలబడి ఉన్న ఓ నీటి ఏనుగు వాటిని గమనిస్తుంది. వెంటనే అది నీళ్లలోకి దూకి సింహాలపైకి దూసుకొచ్చింది. ఇది నా సామాజ్రం మీరెందుకు ఇక్కడికి వచ్చారు.. అన్నంత ఆగ్రహంతో వాటిపైకి వేగంగా ఈదుకుంటూ వచ్చింది. సింహాలపై ఎదురుదాడి చేస్తూ ఆ నీటి ఏనుగు సింహాలను భయపెట్టించ సాగింది. నీటి ఏనుగు దాడికి భయపడిపోయిన సింహాలు నీళ్లలో హిప్పోపొటమస్ దాడి నుంచి తప్పించుకుని తలోదిక్కు పారిపోయాయి. హిప్పోకు అందకుండా పారిపోయి దూరంగా నిలబడి అవి హమ్మయ్యా బతికిపోయాం అన్నట్టుగా చూస్తున్నాయి. ఇదంతా మనం వీడియోలో చూడొచ్చు.
ది గ్రేట్ ప్లెయిన్స్ కన్జర్వేషన్ అనే పేజీ ద్వారా ఈ వీడియో YouTubeలో షేర్ చేయబడింది. వీడియోకి మరపురాని క్షణం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నెటిజన్లను షాక్ అయ్యేలా చేస్తోంది. భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్లిప్‌కి 58,000 పైగా షేర్లు, లైకులు వచ్చాయి. దాదాపు 3,000లకు పైగా కామెంట్‌లు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి