టవల్ అంచున ఉండే ఈ గీతలు కేవలం డిజైన్ అనుకుంటే పొరబడినట్లే.. అసలు రహస్యం ఇదే..?
Towel Border Lines Meaning: రోజూ మనం స్నానం చేసిన తర్వాత ఒళ్లు తుడుచుకోవడానికి ఉపయోగించే తువ్వాలు (టవల్) వెనుక ఇంత పెద్ద కథ ఉందా? 90 శాతం మంది కేవలం అలంకరణ అనుకునే ఆ నిలువు గీతల వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Towel Border Lines Meaning: కొన్ని నెలల క్రితం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘రెడ్డిట్’లో ఒక నెటిజన్ పంచుకున్న ఫోటో సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. పక్కపక్కనే మడతపెట్టి ఉన్న నాలుగు టవల్స్ ఫోటోను ఆయన షేర్ చేశారు. అవి కేవలం రంగుల్లోనే కాకుండా, వాటి చివర్లలో ఉన్న గీతల డిజైన్‌లో కూడా ఒకేలా ఉన్నాయి. అసలు టవల్స్ చివరన ఈ గీతలను ఎందుకు ఇస్తారు? దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ చిన్న ప్రశ్నకు దాదాపు 14 వేల మందికి పైగా స్పందించారు. వేలాది మంది తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చారు.
నెటిజన్లు ఏమంటున్నారంటే..?
ఈ చర్చలో ఒక నెటిజన్ స్పందిస్తూ, “ఈ గీతలు టవల్ మధ్య భాగంలో ఉన్న నీరు కిందకి చేరకుండా అడ్డుకుంటాయి. టవల్ పూర్తిగా తడిసిపోయేంత వరకు నీటి చుక్కలు కింద పడకుండా ఇవి ఆపుతాయి” అని రాసుకొచ్చాడు. మరో వినియోగదారుడు స్పందిస్తూ, “మనం టవల్స్‌ను మడతపెట్టి ఉంచినప్పుడు, ఏది ఏ రకమైన టవలో సులభంగా గుర్తించడానికి ఈ గీతలు ఉపయోగపడతాయి. అందుకే వీటి మందం, సంఖ్య వేర్వేరుగా ఉంటాయి” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
నిపుణులు తేల్చిన అసలు నిజం ఏంటి?
అయితే ఈ విషయంలో అసలు వాస్తవాలను టెక్స్‌టైల్ రంగ నిపుణులు వెల్లడించారు. ‘ది గుడ్ హౌస్‌కీపింగ్ ఇన్‌స్టిట్యూట్’కు చెందిన టెక్స్‌టైల్ ల్యాబ్ అసోసియేట్ డైరెక్టర్ ఎమ్మా సీమూర్ దీనిపై స్పష్టతనిచ్చారు. టవల్ అంచున ఉండే ఈ ప్రత్యేకమైన గీతల డిజైన్‌ను సాంకేతిక భాషలో ‘డోబీ బోర్డర్’ అంటారని ఆమె తెలిపారు.
ఇది కేవలం అందం కోసం వేసే డిజైన్ మాత్రమే కాదు. టవల్ తయారీలో ఉపయోగించే మెత్తటి ‘టెర్రీక్లాత్’ ఫ్యాబ్రిక్‌కు ఇది ఒక బలమైన నిర్మాణాన్ని ఇస్తుంది. టవల్ చివర్లు త్వరగా చిరిగిపోకుండా, దారాలు ఊడిపోకుండా ఈ డోబీ బోర్డర్ గట్టిగా పట్టి ఉంచుతుంది. సాధారణంగా టవల్ అడుగు భాగంలో లేదా అంచులకు కాస్త పైన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వరుసలలో ఈ గీతలను ప్రత్యేకంగా నేస్తారు.
మనం నిత్యం చూసే చిన్న చిన్న వస్తువుల వెనుక కూడా ఎంతో ఆలోచన, సాంకేతికత దాగి ఉంటాయని చెప్పడానికి ఈ టవల్ గీతలే ఒక గొప్ప ఉదాహరణ. కేవలం డిజైన్ అనుకునే ఈ గీతలు టవల్ మన్నికను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నమాట.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
