Photo Puzzle: దమ్ముంటే పట్టుకోండి స్నేక్.. పట్టుకుంటే ఉన్నట్లే దిమాక్..
ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్‌ను తక్కువ అంచనా వేయకండి.. ఇవి కేవలం టైం పాస్ కోసం అనుకోకండి. వీటితో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మీ బుర్రను యాక్టివ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.. మీరు ఎంత క్రియేటివ్.. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో కూడా చెప్పేస్తాయి. మీ కోసం ఓ క్రేజీ పజిల్...
హలో హాయ్.. మీ కోసం క్రేజీ పజిల్ తీసుకొచ్చాం. ఇది మిమ్మల్ని మాయ చేయాలని చూస్తుంది. ఒకింత చిరాకు తెప్పిస్తుంది. ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ ఈ మధ్య నెటిజన్స్‌కు మాంచి కిక్ ఇస్తోన్న నేపథ్యంలో ఈ పజిల్‌తో మీ ముందుకు వచ్చాం. మంచి టైం మాస్ మాత్రమే కాదు.. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ చెక్ చేసేందుకు మంచి సాధనం. అలానే మీ ఐ పవర్ ఏ పాటిదో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేస్తే మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలం అన్న పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. సవాళ్లు స్వీకరించే గుణం ఉన్నవాళ్లు.. ఇలాంటి పజిల్స్ మిస్ చేయరు. ఇలాంటి పజిల్స్ అంతు తేల్చేవరకు నిద్రపోరు. అదిగో అలాంటి క్రేజీ పీపుల్ కోసమే ఈ ఖతర్నాక్ పజిల్.
ఇచ్చిన ఫోటోలో ఓ పొలంలా కనిపిస్తుంది. అక్కడ గడ్డి వాము, పిచ్చి.. పిచ్చి మొక్కలు ఉన్నాయి. అక్కడే ఓ పాము కూడా తిష్ట వేసింది. మీరు అది ఎక్కడుందో కనిపెట్టాలి. కష్టంగా అనిపిస్తుంది.. కానీ ఈజీనే. కొంచెం తీక్షణంగా ఆ ఫోటోలో అన్ని వైపులా చెక్ చేస్తే దొరికేస్తుంది చాలామంది పామును కనిపెట్టలేక ఫెయిల్ అవుతున్నారు. అందుకు కారణం.. అక్కడ ఉన్న పచ్చిక రంగులో ఆ పాము కలిపిపోయింది. ఆ మాత్రం టఫ్ లేకపోతే ఎలా చెప్పండి. చిన్న క్లూ ఏంటంటే ఫోటో కుడివైపు బాగా ఫోకస్ పెట్టి చెక్ చేయండి…
ఫోటోలో పామును కనిపెడితే మీరు తోపులు అంతే. మీకు మంచి అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నట్లే. కనుగొనలేకపోయినా..? పర్లేదు. మీరు మంచి ప్రయత్నం చేశారు. ఇక ఆన్సర్ ఉన్న ఫోటోని దిగువన ఇస్తున్నాం… చూసెయ్యండి. మరో మంచి పజిల్‌తో మళ్లీ కలుసుకుందాం.. బై..బై.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి