Viral: పాల డెయిరీలో నిద్రపోయిన వ్యక్తి.. తెల్లారి ఇంటికెళ్లగా షాకింగ్ సీన్.. ఇంతకీ ఏం జరిగిందంటే!
నేరస్తులు కొత్త పంధాలను ఎంచుకుంటున్నారు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా పక్కా స్కెచ్‌లు వేస్తూ..
నేరస్తులు కొత్త పంధాలను ఎంచుకుంటున్నారు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా పక్కా స్కెచ్‌లు వేస్తూ చోరీలు, దోపిడీలు, దొంగతనాలు పాల్పడుతున్నారు. తాజాగా హర్యానాలోని రేవారి గ్రామంలో వరుసగా రెండు ఇళ్లల్లో భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్ళారు దొంగలు. అక్కడ వరుసగా చోరీలు జరుగుతుండటం.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. రేవారి గ్రామంలోని రెండు ఇళ్లల్లో ఒకే రోజు రాత్రి దొంగలు పడ్డారు. మొదటిగా కృష్ణా అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ దొంగలు.. అక్కడి నుంచి బంగారం, వెండి ఆభరణాలతో సహా ఓ గ్యాస్ సిలిండర్, ఎల్‌ఈడీ టీవీ, లక్షా 5 వేల రూపాయల క్యాష్‌ను పట్టుకెళ్ళారు. ఆ సమయంలో కృష్ణ తన పాల డెయిరీ ఫాంలో రాత్రి నిద్రపోయినట్లు తెలుస్తోంది. తెల్లారి ఇంటికెళ్లి చూసేసరికి అంతా లూటీ చేశారు. అటు రవి కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. అక్కడ ఎలాంటి వస్తువులు, నగదు దొరక్కపోవడంతో వట్టి చేతులతో వెనుదిరిగారు.
కాగా, ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొంతమంది ప్రజలు.. దొంగలకు భయపడి.. తమకు కంప్లైంట్ ఇవ్వట్లేదని.. ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తే.. తాము నేరస్తులను పట్టుకుని కఠిన చర్యలు విధిస్తామని పోలీసులు అంటున్నారు.