AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఒక్క ఆటోలో 27 మంది ప్రయాణికులు.. వీడియోపై ఓ లుక్ వేయండి

పోలీసులు ఈ ఆటోను పట్టుకున్నప్పుడు..  ఆటోలోని ప్రయాణీకులను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ప్రయాణీకులందరినీ లెక్కించడం ప్రారంభించారు,

Viral Video: వామ్మో.. ఒక్క ఆటోలో 27 మంది ప్రయాణికులు.. వీడియోపై ఓ లుక్ వేయండి
Auto Video Viral
Surya Kala
|

Updated on: Jul 11, 2022 | 1:04 PM

Share

Viral Video: ట్రాఫిక్ నిబంధనల ప్రకారం బైక్‌పై గరిష్టంగా ఇద్దరు వ్యక్తులు, ఆటోలో గరిష్టంగా నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు. అయితే ఈ నిబంధనలను మనం పుస్తకాలలో మాత్రమే చూస్తున్నాం.. ఎందుకంటే ఎక్కడ ఏ వాహనదారులను చూసినా ఈ ట్రాఫిక్ నిబంధనలను పాటించేవారు బహు అరుదుగా కనిపిస్తారు. ఒక బైక్ పై 7 ఏడుగురు కూడా ప్రయాణిస్తున్న వీడియోలు చూస్తూనే ఉన్నాం.. తమ వాహనాల్లో  సామర్థ్యం కంటే ఎక్కువ మందిని కూర్చోబెడుతూ ప్రయాణిస్తున్న వారి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. అయితే ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలతో అనేక సార్లు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో డ్రైవర్‌తో సహా 27 మంది ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్‌ వైరల్‌గా మారిన వెంటనే జనాలు దీనిని చూసి ఆశ్చర్యపోయారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఆటోలో డ్రైవర్ 26 మంది కూర్చోబెట్టుకుని ఆటో నడుపుతున్నాడు. పోలీసులు ఈ ఆటోను పట్టుకున్నప్పుడు..  ఆటోలోని ప్రయాణీకులను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ప్రయాణీకులందరినీ లెక్కించడం ప్రారంభించారు, చివరికి లెక్క తేలిన తర్వాత మరింత షాక్ తిన్నారు. ఎందుకంటే డ్రైవర్‌తో సహా 27 మంది అందులో ఉన్నారు. వారందరూ బక్రీద్ సందర్భంగా  ప్రార్థనలు చేయడానికి ఇంటి నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన చాలా మంది.. డ్రైవర్‌కే కాకుండా దానిపై కూర్చున్న వారందరికీ ప్రాణహాని ఉందని, ఇలాంటి పొరపాట్లు రోడ్డు ప్రమాదాలకు కారణమని అంటున్నారు. ఈ షాకింగ్ వీడియోను ఆనంద్ కల్రా అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు వందల కొద్దీ లైక్‌లు భారీ వ్యూస్ వచ్చాయి.

‘ఈ ఆటోను జిల్లాగా ప్రకటించాలి’ అని ఒక వినియోగదారుడు కామెంట్ చేయగా.. మరోవైపు  మరొక నెటిజన్ ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ‘డ్రైవర్ నుండి నిర్వహణ నేర్చుకోవచ్చు. గమనిక – పర్మిట్ కంటే ఎక్కువ మందికి వసతి కల్పించడం నిబంధనలకు విరుద్ధం’ అని మూడవ వినియోగదారు రాశారు. ‘ఇంత మందిని ఒకేసారి చంపడానికి కుట్ర జరిగినందున ఈ టెంపో డ్రైవర్ కు తగిన శిక్ష ఇవ్వాలి. మేము భారతీయులు చాలా సర్దుబాటు చేసుకుని బతకడం అలవాటు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..