Viral: పొలంలో తవ్వకాలు జరుగుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. ఓపెన్ చేసి చూడగా..
పొలం పనులు చేస్తోన్న కొంతమంది కూలీలకు ఓ మట్టి కుండ దొరికింది. అందులో ఏముందా అని తెరిచి చూడగా..
పొలం పనులు చేస్తోన్న కొంతమంది కూలీలకు ఓ మట్టి కుండ దొరికింది. అందులో ఏముందా అని తెరిచి చూడగా.. ఒక్కసారిగా వాళ్ల కళ్లు జిగేలుమన్నాయి. అందులో బోలెడన్ని వెండి నాణేలు ఉన్నాయి. అంతే.! ఇంకేముందు సీన్ కట్ చేయగా.. దెబ్బకు ఫ్యూజులు ఔట్..
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని బరౌలి గ్రామానికి చెందిన రేణు అనే మహిళ తన పొలాన్ని దున్నించేందుకు ఓ ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకుంది. అంతేకాకుండా సాయం కోసం కొంతమంది కూలీలను కూడా పనిలో పెట్టుకుంది. అనంతరం ఆమెకు ఇంటి దగ్గర ఏదో పని ఉండగా.. అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈలోపు ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా.. కూలీలకు ఓ మట్టి కుండ దొరికింది. ఆ కుండ నిండా సుమారు 200 వెండి నాణేలు ఉన్నాయి. ఇక వాటిని సదరు మహిళకు తెలియకుండా ట్రాక్టర్ డ్రైవర్, కూలీలు తీసుకుని ఉడాయించారు. దీనితో రేణు తాను మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించింది. కాగా, పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు 33 వెండి నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.