భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..మీరు ఖచ్చితంగా కోటీశ్వరులైనట్టే..!

భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట ఏమిటో మీకు తెలుసా? తక్కువ ఖర్చుతో కూడిన ఈ మొక్కలు పెంచితే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఏంటి షాక్‌ అవుతున్నారు కదా..? కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కగా పేరుగాంచిన ఒక పంట తక్కువ ఖర్చుతో అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఆ మొక్కలు ఏంటి..? వాటి ప్రయోజనాలు, ఎందుకు ఖరీదు ధర పలుకుతున్నాయో వివరాల్లోకి వెళితే...

భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..మీరు ఖచ్చితంగా కోటీశ్వరులైనట్టే..!
expensive plant in the world

Updated on: Jan 19, 2026 | 11:46 AM

ప్రపంచంలో వ్యవసాయం ఆహారాన్ని అందించే పంట మాత్రమే కాదు.. కొన్ని రకాల పంటలు కోట్లాది రూపాయల ఆదాయ వనరు కూడా. అలాంటి ఒక మొక్క కోకా మొక్క. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కగా పరిగణించబడుతుంది. కొన్ని దేశాలలో ఈ మొక్కను పెంచే రైతులు తక్కువ సమయంలోనే ధనవంతులు అవుతారు. కోకా మొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎక్కువ భూమి, అధిక ఖర్చులు అవసరం లేదు. చిన్న బుష్ రూపంలో పెరిగే ఈ మొక్క ఆకులకు ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉంది. అందుకే దీనిని బంగారం కంటే విలువైన పంటగా పిలుస్తారు.

కానీ, భారతదేశంలో ఈ పంట కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కోకా మొక్కను మాదకద్రవ్య కొకైన్ తయారీకి ఉపయోగిస్తారు. కాబట్టి, భారత ప్రభుత్వం ఈ పంట సాగును పూర్తిగా నిషేధించింది. ఈ మొక్కను పెంచడం, రవాణా చేయడం లేదా అమ్మడం చట్టవిరుద్ధం. భారతదేశంలో ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఈ నల్లమందు సాగుకు అనుమతి ఉంది. కానీ, కోకా మొక్కకు అనుమతి లేదు. ఒక వ్యక్తి కోకా సాగు చేస్తూ పట్టుబడితే మాత్రం..అతనికి జైలు శిక్ష, భారీ జరిమానా ఉంటుంది.

కానీ, ఈ కోకా మొక్కలు ప్రధానంగా దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాలలో పెరుగుతుంది. అక్కడ నేల, వాతావరణం ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఈ పంట ప్రధాన ఆదాయ వనరు. ప్రభుత్వ నియంత్రణలో సాగు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

నిపుణులు చెప్పిన దాని ప్రకారం, రైతులు లాభం కోసం అక్రమ పంటల వైపు మొగ్గు చూపడం ప్రమాదకరం. అధిక రాబడిని అందించే పంటలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం, వ్యవసాయ నిపుణులు దీర్ఘకాలిక అభివృద్ధికి చట్టబద్ధమైన, సురక్షితమైన వ్యవసాయం ఉత్తమ ఎంపిక అని చెబుతున్నారు. ఇది కేవలం ఒక మొక్క విలువను తెలియజేసే వార్త మాత్రమేనని గమనించగలరు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..