Rubber Man: వామ్మో.. శరీరాన్ని ఎటుపడితే అటు వంచేస్తున్న రబ్బర్ మ్యాన్
ఎవరికైనా ఏదైన వ్యాధి సోకితే చాలా బాధ పడుతారు. కొంతమందైతే డిప్రెషన్ లోకి కూడా వెళ్తారు. అయితే అమెరికాకు చెందిన డేనియల్ బ్రౌనింగ్ స్మిత్ మాత్రం తనకు సోకిన అరుదైన వ్యాధిని అవకాశంగా మలుచుకున్నాడు. శరీరాన్ని వంపులు తిప్పుతూ దాదాపు 7 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు.
ఎవరికైనా ఏదైన వ్యాధి సోకితే చాలా బాధ పడుతారు. కొంతమందైతే డిప్రెషన్ లోకి కూడా వెళ్తారు. అయితే అమెరికాకు చెందిన డేనియల్ బ్రౌనింగ్ స్మిత్ మాత్రం తనకు సోకిన అరుదైన వ్యాధిని అవకాశంగా మలుచుకున్నాడు. శరీరాన్ని వంపులు తిప్పుతూ దాదాపు 7 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. దీంతో ఇతను రబ్బర్ బోయ్ గా గుర్తింపు పొందుతున్నాడు. అయితే డేనియల్ శరీరాన్ని ఎటుపడితే అంటు అవలీలగా వంచగలడు. ఇంకో విషయం ఏంటంటే తన శరీరాన్ని మొత్తాన్ని మడత పెట్టుకుని ఏకంగా ఓ పెట్టెలో కూడా వెళ్లిపోగలడు. ఇలాంటి అద్భుతాలు చేయడంతో అతనికి పలు ప్రకటనలు, టీవి కార్యక్రమాలు, సినిమాల్లో కూడా నంటించే అవకాశాలు వచ్చాయి.
అమెరికాలోని మెరిడియన్ ప్రాంతంలో జన్మించిన డేనియల్ తన చిన్నతనంలో బాగా ఎత్తులో నుంచి నేలపై దూకేవాడు. 2007లో మోస్ట్ ఫ్లెక్సిబుల్ మ్యాన్ అనే గిన్నిస్ బుక్ అవార్డు దక్కించుకున్నాడు. ఇలాంటి రికార్డులు ఆయన ఖాతాలో మొత్తం ఏడు చేరాయి. అయితే ఇతను తన శరీరాన్ని ఎలాపడితే అలా వంచడానికి అసలు కారణం ‘ఎలస్ డన్లోస్ సిండ్రోమ్’ అనే వ్యాధి . జన్యుపరమైన లోపం కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి బారినపడినవారి శరీరంలోని కీళ్లు ఎన్ని వంపులైనా తిరుగుతాయి. అయితే ఈ వ్యాధి సోకిన చాలామంది తీవ్రమైన కండరాలు, ఎముకల నొప్పులతో కూడా బాధపడుతుంటారు.కానీ డేనియల్‌కు కొంతవరకు మాత్రమే నొప్పి ఉంటోంది. దీన్నే అవకాశంగా మలుచుకుని తాను ఎంచుకున్న రంగంలో డేనియల్ రాణించగలుగుతున్నాడని వైద్య నిపుణులు అంటున్నారు.
మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం