Viral Video: పాపం అమాయక ఎలుక.. అసలు మ్యాటర్ తెలియక ఆగం ఆగం అయ్యింది..!

|

May 28, 2022 | 9:00 PM

Viral Video: ప్రస్తుత కాలంలో పెంపుడు జంతువులు లేని ఇల్లు చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది తమ తమ ఇళ్లలో తప్పకుండా పెంపుడు

Viral Video: పాపం అమాయక ఎలుక.. అసలు మ్యాటర్ తెలియక ఆగం ఆగం అయ్యింది..!
Rat
Follow us on

Viral Video: ప్రస్తుత కాలంలో పెంపుడు జంతువులు లేని ఇల్లు చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది తమ తమ ఇళ్లలో తప్పకుండా పెంపుడు జంతులను పెంచుకుంటున్నారు. వాటితో కాలక్షేపం చేస్తున్నారు. అవి చూపే స్వచ్ఛమైన ప్రేమను ఆస్వాదిస్తున్నారు. దాదాపు అందరి ఇళ్లలో కుక్కలు, పిల్లులు, కొన్ని రకాల పక్షులు కామన్. విదేశాల్లో అయితే, ఎలుకలు, ఇతర జంతువులను కూడా సాకుతారు. పెంపుడు జంతువుల పట్ల యజమానులు ఎంత ప్రేమాభినాలు చూపుతారో.. అంతకు మించిన ప్రేమ, అప్యాయత, కేరింగ్ చూపుతాయి పెంపుడు జంతువులు. తమ యజమానికి కొంచెం ఏమైనా అయిందంటే చాలు.. వారి పెంపుడు జంతువులు తల్లడిల్లిపోతాయి. వారి స్నేహితులో, బంధువులో సరదాగా వారిని కొట్టినా.. ఆ పెంపుడు జంతువులు అస్సలు సహించవు. తమ యజమానిని వారు ఏమో చేస్తున్నారని భావించి.. వారిపై అటాక్ చేస్తాయి. అంత కేరింగ్ తీసుకుంటాయి. అయితే, తాజాగా ఓ పెంపుడు జంతువుకు తన యజమాని పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేం జరుగుతుందో తెలియక.. అల్లాడిపోయిన ఆ మూగ జీవి ఆత్రుతను చూసి నెటిజన్లు పాపం అంటూనే దాని కేరింగ్ పట్ల ముచ్చటపడుతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. ఓ యువతి తన ఇంట్లో ఎలుకను పెంచుకుంటుంది. అయితే, ఆ యువతి తన ఎలుకపై ప్రాంక్ చేసింది. అందులో భాగంగా యువతి ఒక గది నుంచి మరో గదిలోకి వచ్చింది. అప్పటికే అనుకున్న ప్రకారం.. ఆ యువతి సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటిస్తూ నేలపై పడుకుంది. అయితే, ఆ విషయం తెలియని పెంపుడు ఎలుక.. తన యజమాని కింద పడిపోవడం చూసి ఏదో అయ్యిందని కంగారు పడింది. అమ్మాయి వద్దకు వచ్చి.. ఆమెను తట్టి లేపేందుకు ప్రయత్నిస్తోంది. ఆమెపైనే అటూ ఇటూ తిరుగుతూ కంగారు పడింది. ఇక ఎలుక బాధను చూడలేక ఆ యువతి పైకి లేచింది. ఆ ఎలుక ఊపిరి పీల్చుకుంది. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ ఎలుక ప్రేమకు ఫిదా అయిపోతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి