ఖైదీలను ఉంచడానికి ప్రపంచంలో చాలా జైళ్లు నిర్మించబడ్డాయి. ఈ జైళ్లలో చాలా చాలా ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఎవరి మనసు అయినా సరే ఒక్కసారిగా ఉల్కిపడుతుంది. అయితే ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం ఇప్పుడు పర్యాటకులకు ఇష్టమైనదిగా మారిన జైలు కథ. అత్యంత ప్రమాదకరమైన ఖైదీలను మాత్రమే ఈ జైలులో ఉంచేవారు. అలాంటి ఈ జైలు అకస్మాత్తుగా పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఇక్కడ ఏం జరిగిందనే ప్రశ్న ఇప్పుడు అందిరిలోనూ కలుగుతోంది.
ఆ జైలు టేనస్సీ స్టేట్ జైలు. ఇది 1898 సంవత్సరంలో నిర్మించబడింది.. అప్పట్లో ఇక్కడ అత్యంత్య ప్రమాదకరమైన ఖైదీలను బంధించేవారు. అందుకు వీలుగానే ఇక్కడ జైలుని నిర్మించారు. ఒకప్పుడు ఇది చాలా సురక్షితంగా ఉండేది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య చేసిన హంతకుడు జేమ్స్ ఎర్ల్ రే కూడా ఈ జైలులోనే ఉంచబడ్డాడు.
సామాన్యులకు తెరిచి ఉందా?
కాలానుగుణంగా పరిస్థితులు మారాయి. దీంతో ఈ జైలును యథాతథంగా నిర్వహించ లేకపోయారు. దాదాపు 94 సంవత్సరాల తర్వాత అంటే 1992లో మూసివేసి ఖాళీగా ఉంచారు. అనంతరం 2020 సంవత్సరంలో ఇక్కడ EF3 టోర్నాడో బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో ఇక్కడ ఉన్న ప్రతిదీ నాశనమైంది.
జైలు రాతి గోడకు చెందిన 40 గజాల భాగం, పలు విద్యుత్ స్తంభాలు పడిపోయాయని చెబుతున్నారు. అయితే ఈ విధ్వసం వలన కలిగిన రిలీఫ్ విషయం ఏమిటంటే.. జైలు ఆవరణలో ఎవరూ గాయపడలేదు.ఈ రోజుల్లో జైలు పరిస్థితి దృష్ట్యా ఈ జైలు బయటి సన్నివేశాల చిత్రీకరణకు వినియోగిస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకూ ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ కూడా జరిగాయి. ప్రసిద్ధ గాయకుడు జానీ క్యాష్ 1968లో ఇక్కడ ఖైదీల కోసం ఒక ప్రదర్శన ఇచ్చారని.. 1976లో ఇక్కడి నుండి ఎ కాన్సర్ట్: బిహైండ్ ప్రిజన్ వాల్స్ అనే లైవ్ ఆల్బమ్‌ను రికార్డ్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..