Viral Video: ఎత్తైన జలపాతం నుంచి ఎలా జారిపడ్డాడో చూడండి.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అనే చెప్పాలి. కొన్ని కొన్ని సరదాగా, అనుకోకుండా చేసిన స్టంట్లు ప్రాణాలు పోయేలా ఉంటాయి. ఈ రోజుల్లో యువతో ..

Viral Video: ఎత్తైన జలపాతం నుంచి ఎలా జారిపడ్డాడో చూడండి.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!
Follow us
Subhash Goud

|

Updated on: May 19, 2022 | 6:59 AM

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అనే చెప్పాలి. కొన్ని కొన్ని సరదాగా, అనుకోకుండా చేసిన స్టంట్లు ప్రాణాలు పోయేలా ఉంటాయి. ఈ రోజుల్లో యువతో సాహస క్రీడలు, విన్యాసాల ఉత్సాహం మరింత పెరుగుతోంది. ఏదైనా సాహసం చేయాలంటే అంత సులభమైనది కాదు. ఇటీవల సోషల్‌ మీడియాలో రకరకాల స్టంట్లు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. సాధారణంగా జలపాతల వద్దకు వెళ్తే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాల మీదకే వస్తుంటుంది. నీటితో ఎలాంటి సాహసాలు చేయకూడదు. ఈ ప్రమాదకరమైన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఓ వ్యక్తి జలపాతంపై నుంచి కింది పడిపోయాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొండపై నుంచి జలపాతం అటు వైపుగా వెళ్తుండగా, ప్రమాదవశాత్తు కిందకి జారీ పడ్డాడు. ఇది చూసిన అక్కడున్న వారికి చెమటలు పట్టిపోయాయి. ఈ భయానక దృశ్యాన్ని చూస్తే తప్పకుండా అతని చనిపోయి ఉంటాడని భావించారు. కానీ అతనికి భూమి మీద బతికే అవకాశాలున్నాయి. ఇంత ప్రమాదం జరిగినా అతనికి పెద్దగా గాయాలేమి కాకుండా బతికి బయట పడ్డాడు. ఈ స్టంట్ చాలా ప్రమాదకరమైనది. ప్రస్తుతం ఆయన ప్రాణాలు పోయేంత గాయాలు కానట్లు తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియో చైనాలోని సుసోంగ్ కౌంటీలోని జియుజింగ్‌గౌలోని ఒక పర్యాటక ప్రదేశంలో జరిగినది. ప్రస్తుతం వీడియో చివరలో పడిపోయిన తర్వాత, వ్యక్తి రాళ్ల కొలనులోకి వెళ్లగలిగాడు. అతని చుట్టూ నిలబడి ఉన్న వ్యక్తులు అతన్ని రక్షించారు. ఈ వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వీడియో చూసిన యూజర్లు ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.