AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : వామ్మో.. హెల్మెట్‌లో వింత శబ్దం.. తీరాచూస్తే గుండె గుభేల్..

ఇక ఆత్మరక్షణ కోసం పాములు దాక్కుంటాయని అంటారు. కాబట్టి దొంగచాటుగా కొన్నిసార్లు స్కూటీ, షూ లేదా కార్లు మొదలైన వాటిలో ఉంటాయి.

Viral Video : వామ్మో.. హెల్మెట్‌లో వింత శబ్దం.. తీరాచూస్తే గుండె గుభేల్..
Helmet
Rajeev Rayala
|

Updated on: Feb 27, 2023 | 8:32 PM

Share

సోషల్ మీడియాలో చాలా రకాల పాము వీడియోలను మనం చూస్తూనే ఉంటాం. పాముల్ని చూడటానికే భయపడిపోతాం.. అదే పాము మన ముందుకు వస్తే ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైకే పోతాయి. ఇక ఆత్మరక్షణ కోసం పాములు దాక్కుంటాయని అంటారు. కాబట్టి దొంగచాటుగా కొన్నిసార్లు స్కూటీ, షూ లేదా కార్లు మొదలైన వాటిలో ఉంటాయి. ఇలాంటి వీడియోలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..

హెల్మెట్‌లో ప్రమాదకరమైన పాము ఎలా దాక్కుంటుందో ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. ఆ వీడియోలో ఓ యువకుడు హెల్మెట్ పట్టుకుని  ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అతను తన హెల్మెట్ నుండి పామును బయటకు తీయడం మనం చూడొచ్చు. పామును బయటకు తీశాడు.  చిన్న పామే అయినా చాలా ప్రమాదకరమైన పాము అది.

ఒక్కసారి ఆ యువకుడు హెల్మెట్ పెట్టుకునే ముందు చూడకపోతే ఏమై ఉండేదో ఆలోచించండి. ఈ వైరల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా aahanslittleworld ద్వారా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 1.1 మిలియన్ వీక్షణలు. 28.7 లైక్‌లు, చాలా కామెంట్‌లు వచ్చాయి.

Follow Us