కింగ్ కోబ్రా.. దీనినే మనం తెలుగులో నల్లతాచు, రాచనాగు అని పిలుస్తుంటాం. ఈ పాము గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది పాములలో అత్యంత విషపూరితమైనదని మనందరికీ తెలుసు. దీనికి సంబంధించిన వీడియోలను మీరు సోషల్ మీడియాలో, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి చానెల్‌లో చూసే ఉంటారు కూడా. ఇక ఈ కింగ్ కోబ్రా కాటు వేస్తే పది నిముషాల కంటే తక్కువ సమయంలోనే ప్రాణాలు కోల్పోతారని, దాని విషం అంత ప్రమాదకరమని కూడా జగమెరిన సత్యమే. అందుకే చాలా మంది పాము అంటే భయపడినా భయపడకపోయినా.. కింగ్ కోబ్రా అంటే హడలిపోతారు.
అయితే ఈ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక స్నేక్ కాచర్ బుసలు కొడుతున్న 20 అడుగుల కింగ్ కోబ్రాను సునాయాసంగా పట్టేశాడు. సాధారణంగా ఎంతో అనుభవం ఉన్నస్నేక్ క్యాచర్‌లు మాత్రమే కింగ్ కోబ్రాను ఒడిసి పట్టుకుంటారు. అయితే 15, 20 అడుగుల కింగ్ కోబ్రాలు స్నేక్ క్యాచర్‌లకు కూడా మాములుగా చిక్కవు. బుసలు కొడుతూ మీదికి దూసుకొస్తాయి. ఈ క్రమంలోనే కింగ్ కోబ్రా కాటుకు గురై మరణించిన స్నేక్ క్యాచర్‌లు కూడా ఉన్నారు. అందుకే భారీ సైజ్ కింగ్ కోబ్రాల విషయంలో స్నేక్ క్యాచర్‌లు కూడా కాస్త వెనకడుగు వేస్తారు. అయితే ముందుగా చెప్పుకున్న స్నేక్ క్యాచర్ మాత్రం 20 అడుగుల కింగ్ కోబ్రాను సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఇండోనేసియాలోని ఓ బైక్ రిపేర్ షాపులో 20 అడుగుల కింగ్ కోబ్రా దూరింది. ఇది చూసిన ఓనర్.. స్నేక్ క్యాచర్‌లకు సమాచారం అందించాడు. అక్కడకు ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు వచ్చి షాపులోకి వెళ్లారు. షాపు మొత్తం వెతకగా.. ఓ మూలాన ఆ తాచుపాము కనిపించింది. స్నేక్ స్టిక్ సాయంతో పామును సామాను నుంచి బయటికి తీసుకొచ్చారు. కింగ్ కోబ్రా సగం బయటికి రాగానే.. ఓ స్నేక్ క్యాచర్ దాని తోకను పట్టుకుని బయటికి లాగాడు. బయటికి వచ్చిన పాము పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్నేక్ క్యాచర్ గట్టిగా దాని తోకను పట్టుకున్నాడు. దాంతో అది బుసలు కొడుతూ మీదికి వచ్చింది. అయినా అతడు దాన్ని వదలలేదు.
కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ నెమ్మదిగా బయటికి తీసుకొచ్చాడు. పడగ విప్పిన పామును తన అనుభవంతో స్నేక్ క్యాచర్ కేవలం సింగిల్ హ్యాండ్‌తో తలను పట్టేశాడు. ఆపై మరో అతను నడుము పట్టుకుని సంచిలో బంధించాడు. ఇక దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘Nick Wildlife’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా 4 రోజుల క్రితం షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 63 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాక ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..