Video: విమానం టేకాఫ్‌ను దగ్గర్నుంచి చూద్దామని వెళ్తే.. ఏం జరిగిందో చూడండి!
సింట్ మార్టెన్‌లోని మహో బీచ్ ప్రిన్సెస్ జూలియానా అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉంది. విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు వచ్చే బలమైన గాలి ప్రవాహం వల్ల పర్యాటకులు నేలమీద పడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ బీచ్ సాహసయాత్రలను ఇష్టపడేవారికి ప్రసిద్ధమైన ప్రదేశం. కానీ, విమానాలకు దగ్గరగా నిలబడటం ప్రమాదకరం అని గుర్తుంచుకోవాలి.

నిజానికి విమానాలు టేకాఫ్ అవ్వడం, ల్యాండ్ అవ్వడం చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అన్ని ఎయిర్ పోర్ట్స్‌లో ఆ అవకాశం ఉండదు. కానీ, కొన్ని ఎయిర్ట్స్ పక్కనే జన సంచారం ఉండే ప్రాంతాలు ఉంటాయి. అలాంటి చోట్లలో విమానలు టేకాఫ్ అవ్వడం, ల్యాండ్ అవ్వడం లైవ్‌లో చాలా దగ్గర నుంచి చూడొచ్చు. అలాంటి ఓ ప్రాంతామే కరేబియన్ ద్వీపం దక్షిణ భాగంలో ఉన్న సింట్ మార్టెన్ దేశంలోని మహో బీచ్. ఈ బీచ్‌ను సందర్శించే ప్రజలు టేకాఫ్ అవ్వడానికి సిద్ధమవుతున్న జెట్‌కు చాలా దగ్గరగా నిలబడి ఉండటం చూడవచ్చు. అయితే టేకాఫ్ సమయంలో విమానం దగ్గర నిలబడి ఉన్నప్పుడు అది వదిలే గాలి ప్రెజర్‌కి మనుషులు వెళ్లి సముద్రంలో పడుతున్నారు. అంత వేగంగా విమానం నుంచి గాలి వస్తోంది.
ప్రిన్సెస్ జూలియానా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెలుపల ఉన్న ఈ బీచ్ సాహసయాత్రను ఇష్టపడే పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ కేంద్రంగా ఉంది. ఆ ప్రదేశం రన్‌వే నుండి కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్నందున, విమానం బీచ్‌కు వెళ్లేవారి కంటే కేవలం 20 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అయితే వైరల్ అవుతున్న వీడియోలో MD-80 సిరీస్‌కు చెందిన ఒక పెద్ద విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా, బీచ్ వెంబడి విమానాశ్రయం ఫెన్సింగ్ దగ్గర పర్యాటకులు గుమిగూడుతున్నట్లు కనిపిస్తోంది. విమానం ఇంజన్లు స్టార్ట్ అయిన వెంటనే చాలా శక్తివంతమైన గాలి వీస్తూ జనసమూహాన్ని చీల్చుకుంటూ ముందుకు కదులుతున్నట్లు వీడియోలో మీరు చూస్తారు. అదే సమయంలో, ప్రజలు అరుస్తూ, అరుస్తూ నేలపై పడిపోతారు. కొంతమంది కింద పడిపోకుండా ఉండటానికి నేలపై పడుకుంటారు.
Insane jet blast at St. Martin Airport: a tourists get blown away by MD80 aircraft taking off. pic.twitter.com/7Q6AjQoC7k
— Out of Context Human Race (@NoContextHumans) May 11, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
