AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

450 రోజులుగా చికెన్ మాత్రమే తింటున్నాడు

సింగపూర్‌కు చెందిన ఓ యువకుడు తనకు ఇష్టమైన చికెన్ రైస్‌ను గత 450 రోజులుగా రోజూ తింటూనే ఉన్నాడు. సాధారణంగా ఎంత ఇష్టమైన ఆహారమైనా రోజూ తింటే ముఖం మొత్తేస్తుంది. కానీ, అతడు మాత్రం చికెన్ వంటకాలను అలా లాగించేస్తూనే ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘జి ఫాన్ ఫాన్’ అనే వ్యక్తి రోజుకో చికెన్ వంటకాన్ని తింటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సెప్టెంబరు 2017 నుంచి అతను ఓ ఉద్యమంలా చికెన్‌ను ఆరగిస్తున్నాడు. ఈ సందర్భంగా తాను తింటున్న చికెన్ వంటకాన్ని […]

450 రోజులుగా చికెన్ మాత్రమే తింటున్నాడు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 16, 2019 | 4:27 PM

Share

సింగపూర్‌కు చెందిన ఓ యువకుడు తనకు ఇష్టమైన చికెన్ రైస్‌ను గత 450 రోజులుగా రోజూ తింటూనే ఉన్నాడు. సాధారణంగా ఎంత ఇష్టమైన ఆహారమైనా రోజూ తింటే ముఖం మొత్తేస్తుంది. కానీ, అతడు మాత్రం చికెన్ వంటకాలను అలా లాగించేస్తూనే ఉన్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘జి ఫాన్ ఫాన్’ అనే వ్యక్తి రోజుకో చికెన్ వంటకాన్ని తింటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సెప్టెంబరు 2017 నుంచి అతను ఓ ఉద్యమంలా చికెన్‌ను ఆరగిస్తున్నాడు. ఈ సందర్భంగా తాను తింటున్న చికెన్ వంటకాన్ని ‘Everyday’ హ్యాష్ ట్యాగ్‌తో రోజుల సంఖ్యను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు 450 రోజులు అతడు చికెన్ తింటూనే ఉన్నాడు. అతడి ఈ ఆహారపు అలవాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us