ఏడాదికి రూ. 27 కోట్లు.. భారీగా పెరిగిన సింగపూర్ ప్రధాని జీతం!
ప్రధాని సహా మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు ప్రపంచంలోనే అధిక జీతాలు చెల్లించే దేశంగా సింగపూర్ కి పేరుంది. 15 ఏళ్ల తర్వాత మంత్రివర్గ సభ్యుల జీతాలను భారీగా పెంచుతూ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తాజాగా పార్లమెంట్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ లేటెస్ట్ పెంపుతో ప్రధాని వార్షిక జీతం ఏకంగా 64 శాతం పెరిగి 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు (రూ. 26.9 కోట్లు) జంప్ అయింది.

విమర్శలు వస్తాయని ఊహించిన ప్రధాని… తన జీతంలో పెరిగిన అదనపు మొత్తాన్ని తాను తీసుకోనని, రాబోయే ఐదేళ్ళ కాలంలో దశల వారీగా చారిటీకి డొనేట్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత సింగపూర్ లో ఒక్కసారిగా దేశ ప్రధాని సహా మంత్రుల జీతాలనుపెంచారు. పార్లమెంట్ సభ్యుల నెలవారీ జీతం 13,750 సింగపూర్ డాలర్ల నుంచి ఏకంగా 18,500 డాలర్లకు పెరిగింది. డిప్యూటీ ప్రధాని వేతనాన్ని 1.87 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 3.06 మిలియన్ సింగపూర్ డాలర్లకు పెంచారు. కేబినెట్ మంత్రులకు వారి హోదాలను బట్టి వాళ్ల వార్షిక వేతనాలు 1.80 మిలియన్ నుంచి 2.88 మిలియన్ సింగపూర్ డాలర్ల మధ్య ఉండేలా కొత్త బెంచ్‌మార్క్ ఫిక్స్ చేశారు.
ప్రపంచ నేతల వేతనాల పై “పొలిటికల్ శాలరీస్” అందించిన నివేదిక ప్రకారం, 2025-2026 సంవత్సరంలో అత్యధిక వేతనాలు అందుకున్న టాప్ 5 నేతల జాబితాలో సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ప్రధానులు ఉన్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ పోటీ లేకుండా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. స్విస్ ప్రధాని 500,000 డాలర్ల వేతనం అందుకుంటే అమెరికా అధ్యకుడు ట్రంప్ 400,000 డాలర్ల వేతనంతో మూడవ స్థానంలో ఉన్నారు. .
ప్రపంచ దేశాల రాజకీయ నేతల వేతనాల కంటె సింగపూర్ లో జీతాలు ఆల్రెడీ పీక్స్‌లో ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు ఏకంగా 60% పైగా పెంచేయాలని డిసైడ్ అవ్వడమే అసలు ట్విస్ట్! ఈ భారీ శాలరీ హైక్ కు కారణాలు ఉన్నాయని సింగపూర్ ప్రభుత్వం చెబుతోంది. దేశంలో అవినీతికి ఆస్కారం లేకుండా చూడటానికి, అలాగే కార్పొరేట్ రంగంలో పోటీపడే ప్రతిభావంతులను ప్రభుత్వ పాలనలోకి ఆకర్షించడానికి ఈ హై-పే సిస్టమ్ అవసరమని సింగపూర్ గట్టిగా నమ్ముతోంది. బెస్ట్ టాలెంటెడ్ మైండ్స్‌ని రాజకీయాలలోకి అట్రాక్ట్ చేయాలంటే రేంజ్ వేరే లెవెల్‌లో ఉండాల్సిందే అన్నది వాళ్ల వాదన. కార్పొరేట్ సెక్టార్ కు దీటుగా శాలరీలు ఇస్తేనే సమర్థులైన లీడర్స్ రాజకీయాల్లోకి వస్తారన్నది వాళ్ల లాజిక్. మొత్తానికి రాజకీయాలను కూడా పక్కా కార్పొరేట్ లెవెల్ ప్రొఫెషనల్ జాబ్ లాగా మార్చేసి, టాలెంటెడ్ పీపుల్‌కి ఊహించని జీతాల ఎర వేస్తూ సింగపూర్ గవర్నమెంట్ ట్రెండింగ్ లో నిలిచింది.
అయితే ఈ సాలరీ హైక్ తాము ఇష్టమొచ్చినంత శాతం వేసుకుని పెంచుకున్నది కాదనీ స్వతంత్ర కమిటీ రెకమండ్ చేసిన తర్వాతే పెరిగిందని ప్రధాని క్లారిటీ ఇచ్చేశారు. అయితే శాలరీ హైక్ అందరికీ ఒకేసారి పడిపోదు. అక్టోబర్ 15 నుంచి కేవలం 9% ప్రారంభ అడ్జస్ట్‌మెంట్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ ఆధారంగా మిగతా హైక్స్ ఉంటాయట. మొత్తానికి పబ్లిక్ మనీతో లీడర్ల విలాసాలు ఏమో కానీ, గవర్నెన్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండాలనేది ఆ దేశం రూల్! వేతనాల అంశంలో సింగపూర్ రూటే సెపరేటు అని మరోసారి ప్రూవ్ చేశారు.