Karthikeya: కార్తికేయ ఎమోషనల్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళీ సతీమణి..
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా, ఎమోషనల్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ప్రసంగిస్తూ వేదికపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచారని, ఆయన పేరుకు ఎలాంటి భంగం కలగకుండా మరింత పైకి తీసుకువెళ్లడమే తన ధ్యేయమని తెలిపారు.

మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక మంగళవారం సాయంత్రం సినీ అభిమానుల కోలాహలం మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజమౌళి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడిన ఎమోషనల్ ప్రసంగం సభలోని ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. వేదికపై ఆయన మాట్లాడిన తీరు, కుటుంబం పట్ల ఆయన వ్యక్తపరిచిన ప్రేమ అందరి హృదయాలను తాకింది. కార్తీకేయ మాట్లాడుతుండగా ఎస్..ఎస్ రాజమౌళి సతీమణి భావోద్వేగానికి గురయ్యారు.
ప్రసంగం ప్రారంభంలోనే తన తండ్రి, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అందించిన ప్రోత్సాహాన్ని కార్తికేయ గుర్తుచేసుకున్నారు. తన తండ్రి ఎల్లప్పుడూ తనకు వెన్నుదన్నుగా నిలిచారని, ఆయన సంపాదించిన పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి భంగం కలగకుండా మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే తన జీవిత ఆశయమని తెలిపారు. వేదికపై కార్తికేయ తన తల్లి రమా రాజమౌళి మరియు ఇతర కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “నా కుటుంబమే నాకు అతిపెద్ద కొండంత అండ” అంటూ ఆయన చెప్పిన ఎమోషనల్ మాటలకు వేదిక ముందున్న ఆయన తల్లి రమా రాజమౌళి కంటతడి పెట్టుకున్నారు. ఈ సన్నివేశం ఈవెంట్‌లోనే అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది.
సినిమా నిర్మాణంలో ఎదురైన సవాళ్లను పంచుకుంటూ, ఈ సినిమాను హైదరాబాద్‌లోని 75కి పైగా రియల్ లొకేషన్లలో , రద్దీగా ఉండే రోడ్లపై చిత్రీకరించినట్లు చెప్పారు. ప్రొడక్షన్ టీమ్ సభ్యులు శశాంక్, రాహుల్, సతీష్, అభయ్, యోగానంద్ లతో పాటు యావత్ టీమ్ అందించిన అద్భుతమైన సహకారం వల్లే ఇది సాధ్యమైందని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (తారక్ అన్న) పై ఉన్న అభిమానాన్ని కార్తికేయ ప్రత్యేకంగా చాటుకున్నారు. తమ మధ్య ఉన్న ప్రేమాభిమానాలు, ఆత్మీయ బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
