Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ఓ మై గాడ్’.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. విమానం ఎలా పల్టీ కొట్టిందో మీరే చూడండి..

Shocking Video: గాలుల తీవ్రత కారణంగా.. వాతావరణ ప్రతికూలతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి.

Viral Video: ‘ఓ మై గాడ్’.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. విమానం ఎలా పల్టీ కొట్టిందో మీరే చూడండి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 02, 2022 | 3:54 PM

Shocking Video: గాలుల తీవ్రత కారణంగా.. వాతావరణ ప్రతికూలతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి. తాజాగా అలాంటి భయానక పరిస్థితికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం ప్రమాదానికి గురికాకపోయినప్పటికీ.. ప్రమాదం అంచుల వరకు వెళ్లిన విమానాన్ని పైలట్ ఎంతో చాకచక్యంగా సేఫ్ చేశాడు. వైరస్ అవుతున్న ఈ వీడియోలో విమానం ల్యాండ్ అవుతున్న సందర్భంగా ఒక్కసారిగా భారీ గాలులు వీచాయి. దాంతో విమానం ఒకవైపునకు ఒరిగిపోయింది. ఆ తరువాత పల్టీలు కొట్టినంత పని చేసింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి.. సెకన్ల వ్యవధిలోనే విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశాడు. ఆ తరువాత తిరిగి మళ్లీ సేఫ్‌గా విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఈ ఘటన లండన్‌లో వెలుగు చూసింది.

బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 1307 అబేర్డీన్ నుంచి లండన్‌ హీత్రో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. పైలన్ విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, బలమైన ఈదురు గాలుల కారణంగా విమానం ల్యాండింగ్ కష్టతరమైంది. తీవ్రమైన గాలుల మధ్యే.. పైలట్ విమానాన్ని దింపేందుకు ప్రయత్నించాడు. కానీ, అది బెడిసి కొట్టింది. గాలుల దెబ్బకు విమానం అటూ ఇటూ ఊగిపొయింది. విమాన చక్రాలు రెండుసార్లు జంప్ అవుతూ టార్మాక్‌ను బలంగా తాకాయి. ఒకానొక దశలో విమానం తోక భాగం రోడ్డుకు తగిలింది. దాంతో అక్కడ దుమ్ము రేగింది. అయితే, పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్.. ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. విమానాన్ని ల్యాండ్ చేయకుండా టేకాఫ్ చేశాడు. కేవలం నాలుగు నిమిషాల్లో 1,173 మీటర్ల ఎత్తుకు టేకాఫ్ చేశాడు. రెండవ ప్రయత్నంలో విమానాన్ని ల్యాండింగ్ చేశాడు పైలట్.

అయితే, విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. విమానం సరిగానే ల్యాండ్ అవుతుందని విశ్వాసం ప్రదర్శించాడు. అయితే, రన్‌వేకి సమీపించగానే.. అతని నమ్మకం పటాపంచలైంది. ‘ఓ మై గాడ్’ అంటూ కేకలు పెట్టాడు వీడియో తీసిన వ్యక్తి. మొత్తానికి ఈ భయనాక ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Also read:

Zodiac Signs: ఈ 4 రాశుల వ్యక్తులు ఎవ్వరితో కలవరు.. మాట్లాడటానికి ఇష్టపడరు..?

Cucumber Water: బరువు తగ్గాలనుకుంటున్నారా రోజూ.. దోసకాయ వాటర్‌ని తాగండి.. తయారీ ఇలా.

BEL Jobs: బీటెక్‌/ఎంటెక్‌ యువతకు అలర్ట్‌! నెలకు రూ.40,000ల జీతంతో 75 ట్రైనీ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. వివరాలివే