Viral Video: వివాహానికి ముందు పరీక్ష రాసేందుకు హాజరైన వధువు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: చాలా మంది అమ్మాయిలు పెళ్లి కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారు. అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు నిర్ణయించి సంబంధాలు..

Viral Video: వివాహానికి ముందు పరీక్ష రాసేందుకు హాజరైన వధువు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Follow us

|

Updated on: Nov 24, 2021 | 11:25 AM

Viral Video: చాలా మంది అమ్మాయిలు పెళ్లి కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారు. అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు నిర్ణయించి సంబంధాలు కుదుర్చుకోవడంతో వారి చదువులకు ఆటంకం ఏర్పడుతుంది. కానీ ఓ అమ్మాయికి పెళ్లి కుదరడం.. పెళ్లి జరిగే రోజు పరీక్ష ఉండటంతో వివాహానికి ముందు పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాస్తున్న వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆ యువతి సాంప్రదాయంగా వివాహానికి ముందు ధరించే దుస్తులతో పరీక్షకు హాజరైనట్లు కనిపిస్తుంటుంది. అయితే పెళ్లి రోజే పరీక్ష ఉండటంతో తన భర్తతో కలిసి ఆమె పరీక్ష కేంద్రానికి వచ్చింది. పెళ్లి కంటే ముందు చదువుకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లయింది.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిన శివంగి బగ్థారియా అనే పెళ్లి కూతురు పెళ్లి దుస్తులు ధరించి పరీక్ష హాలుకు రాగానే పరీక్ష రాసే తోటి అభ్యర్థులు ఆశ్చర్యపోయారు. అయితే వివాహం రోజే పరీక్ష ఉండటంతో ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆమె పరీక్ష రాయగలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. తమకు పెళ్లి కంటే చదువు ముఖ్యమని శివంగి బగ్తారియా చెప్పారు. ఇప్పటికే ఈ వీడియోను 5 లక్షలకుపైగా మంది వీక్షించారు. అయితే శివాంగి ఇలా పెళ్లి కంటే పరీక్షలపై దృష్టి పెట్టడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారింది. చాలా మంది శివాంగి సెంటిమెంట్‌ని మెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:

Fog: ఉదయాన్నే పొగమంచు ఎందుకు ఏర్పడుతుంది.. అలా ఏర్పడేందుకు గల కారణాలు ఏమిటి.?

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి