Viral Video: అలలకై ఎదురుచూపులు.. తీరా చెంతకొస్తే పరుగులు.. ఆకట్టుకుంటున్న వీడియో..
ఇటీవల సోషల్ మీడియాలో పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అటు నెటిజన్స్ సైతం జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిత్యం నెట్టింట్లో వైరల్ అయ్యే వీడియోలలో కొన్ని చూసేందుకు మరి వికారంగా అనిపించిన.. మరికొన్ని వీడియోలు ఎంతో ముచ్చట కలిగిస్తాయి. అలాగే కొన్ని జంతువులు, పక్షులు చేసే చిలిపి అల్లర్లకు సంబంధించిన వీడియోలను నెటిజన్లను హత్తుకుంటుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. ప్రపంచంలో ఎక్కడైన చిన్న సంఘటన జరిగిన క్షణాల్లో నెట్టింట్లో హల్చల్ చేస్తుంటాయి. తాజాగా సీ పక్షులకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ వీడియో చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. సముద్ర తీరాన అలలతో ఆటలంటే కేవలం మనకే కాదు.. పక్షులకు కూడా తెగ ఇష్టం. పక్షులు చేసే కొన్ని పనులు చూస్తే.. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే జయిస్తాం. అలాంటి కోవకు చెందిన వీడియోనే ఇది. గుంపుగా చేరి అలలతో ఆటలాతున్నాయి కొన్ని పక్షులు.. మరి అంతగా నెటిజన్లను హత్తుకుంటున్న వీడియో ఎంటో చూసేద్దామా.
తాజాగా సోషల్ మీడియా సీ పక్షులకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. అందులో చాలా పక్షులు సముద్ర తీరాన నిల్చుని అలల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. తీరా అలలు దగ్గరకు వస్తే.. నీటి బొట్టు తగలకుండా పరిగెడుతూ ఉంటాయి. ఎదురు చూపులు ఫలించి.. చెంతకు వచ్చిన అలలతో ఆ పక్షులు ఆడుకుంటున్నాయి. ఇక అలలు కూడ ఆ పక్షులను వెంబడిస్తున్నట్లుగానే .. వాటి వెనకాలే అంత అలా సముద్ర తీరాన అలలతో ఆడుకుంటున్న ఆ పక్షులకు సంబంధించిన క్యూట్ వీడియోను ఇన్స్టాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 41 వేల మంది సోషల్ మీడియాలో వీక్షించారు. ఈ క్యూట్ వీడియో పై మీరు ఓ లుక్కెయ్యండి..
వీడియో..
Nagarkurnool: ఫుల్‌గా మద్యం తాగేసి గణేశ్ మండపం వద్ద కానిస్టేబుల్ ఓవరాక్షన్!