Shocking News: విరిగిపోయిన చెట్టు కొమ్మ అని పక్కనే నిల్చున్నాడు.. అసలు మ్యాటర్ తెలియడంతో పరుగులు తీశాడు..
Shocking News: సాధారణంగానే చాలా మంది ఏదో ఒక సందర్భంలో పొరబడుతూనే ఉంటారు. తెలియక తప్పు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
Shocking News: సాధారణంగానే చాలా మంది ఏదో ఒక సందర్భంలో పొరబడుతూనే ఉంటారు. తెలియక తప్పు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఒకటి చూసి మరొకటి భావిస్తుంటారు. అలా ఎంతో మంది ఎరక్కపోయి.. ఇరుక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వింత ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే స్కాట్లాండ్‌లో చోటు చేసుకుంది. అతను పొరపాటే.. అతని ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల స్కాట్లాండ్‌లో ఒక వ్యక్తి పార్క్‌కు వెళ్లాడు. అక్కడ ఒక భారీ కొండచిలువ ఉంది. అయితే, అది కదలకుండా ఉండటంతో దానిని చూసి విరిగిపోయిన చెట్టుకొమ్మ అని భావించాడు. దాని పక్కనే నిల్చున్నాడు. అయితే, తన కాళ్లను తాకుతూ ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. వెంటనే నేలవైపు క్షుణ్ణంగా పరిశీలించి చూడగా.. అసలు విషయం తెలిసిందే. అది పెద్ద కొండచిలువ అని గ్రహించాడు. ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయ్యింది. అతను వెంటనే అక్కడి పరుగు లంకించుకున్నాడు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. స్కాట్లాండ్‌కు చెందిన 22 ఏళ్ల జాక్ కార్సన్.. వెస్ట్ డన్‌బర్టన్‌షైర్‌లోని క్లైడ్ బ్యాంక్ డ్రమ్మరీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పార్క్‌లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక పెద్ద పామును చూశాడు. అయితే, తొలుత దానిని విరిగి పడి ఉన్న చెట్టుకొమ్మగా భావించాడు. దాని పక్కనే నిల్చున్నాడు. ఆ పాము మెళ్లగా కదలడం మొదలు పెట్టింది. ఏంటా అని పరిశీలించి చూడగా.. అతని ఫ్యూజులు ఎగిరిపోయాయి. 14 అడుగుల పొడవైన భారీ కొండ చిలువ పక్కన తాను నిల్చున్నాని గ్రహించాడు. భయంతో హడలిపోయాడు. వెంటనే దాని దగ్గరి నుంచి పారిపోయాడు. ఆ తరువాత కొంచెం ధైర్యం చేసి ఆ పామును ఫోటో తీసుకున్నాడు. దానికి సంబంధించి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
Also read:
Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..
Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే కాలయముడు అయ్యాడు.. గంజాయి మత్తులో కత్తెరతో..