ఇదేమరి తిక్కంటే..! మెట్ల రెయిలింగ్‌ లో తలదూర్చిన యువతి.. బయటకు రాలేక పడ్డ అవస్థలు చూడాలి..

సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో పిల్లలు భయపడి ఏడవడం మొదలుపెడతారు. కానీ, ఇక్కడ ఉన్న అమ్మాయి మొత్తం పరిస్థితిలో నవ్వుతూనే ఉంది. పైగా చాలా ప్రశాంతంగా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది భిన్నమైన అభిప్రాయాలు తెలియజేశారు.

ఇదేమరి తిక్కంటే..! మెట్ల రెయిలింగ్‌ లో తలదూర్చిన యువతి.. బయటకు రాలేక పడ్డ అవస్థలు చూడాలి..
Schoolgirl Head Stuck In Staircase Railing
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 14, 2024 | 1:56 PM

తప్పులు చేయడం మానవ సహజం. కానీ, పొరపాట్లు ప్రమాదాలకు దారితీసినప్పుడు పరిస్థితిని ఊహించలేం. అలాంటి పొరపాటే చేసింది ఇక్కడో యువతి.. తను చేసిన తప్పిదం వల్ల ఆ అమ్మాయి ప్రమాదంలో పడినప్పటికీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌కు చెందినదిగా తెలిసింది.

వైరల్‌ వీడియోలో స్కూలు మెట్లపై కూర్చున్న ఒక అమ్మాయి తన తలను మెట్ల రెయిలింగ్‌లోకి పెట్టి మరీ కిందకు దిగుతున్న అబ్బాయిని చూస్తూ ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది. అంత వరకు బాగానే ఉంది.. కానీ, ఆ తరువాత తన తిప్పలు చూడాలి.. ఆ అమ్మాయి తల రెయిలింగ్‌లో ఇరుక్కుపోయింది. బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పాపం భయంతో వణికిపోయింది.. కానీ, అక్కడున్న వారంతా ఇది చూసి ఎంజాయ్‌ చేశారు. అక్కడ సీన్‌ అంతా తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో వీడియోలు తీయటం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. యువతి తల రెండు రెయిలింగ్‌ల మధ్య ఇరుక్కుపోయి చాలా సేపు ప్రయత్నించినా బయటకు తీయలేకపోయింది. దాంతో ఆమె స్నేహితులు వెంటనే స్కూల్‌ సిబ్బందికి సమాచారం అందించారు. తరువాత, స్కూల్‌ టీచర్స్‌, స్టాఫ్‌ అక్కడు చేరుకున్నారు. వారిలో ఒకరు ఆ యువతిని రక్షించే ప్రయత్నం చేశారు..ఎట్టకేలకు ఆమె తలను సురక్షితంగా బయటకు తీశారు. ఇదంతా వైరల్‌ వీడియోలో వీడియోలో చూడవచ్చు. స్కూల్‌లోని సీసీటీవీ ఫుటేజీలో కూడా ఈ ఘటనను వీడియో రికార్డైంది.

ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by MS News (@mustsharenews)

ఇకపోతే, టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 53 లక్షల మంది వీక్షించారు. దీని తర్వాత చాలా మంది ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా షేర్ చేశారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో పిల్లలు భయపడి ఏడవడం మొదలుపెడతారు. కానీ, ఇక్కడ ఉన్న అమ్మాయి మొత్తం పరిస్థితిలో నవ్వుతూనే ఉంది. పైగా చాలా ప్రశాంతంగా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది భిన్నమైన అభిప్రాయాలు తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..