AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందయ్యా ఇది.. డాక్టర్లు, నర్సుల డ్యాన్స్‌తో దద్దరిల్లిన ఆస్పత్రి.. కట్ చేస్తే..!

అదొక పేరు మోసిన జిల్లా ఆసుపత్రి.. అక్కడే పార్టీకి ఏర్పాట్లు చేశారు.. పెద్ద సౌండ్లతో పాటలు.. డాక్టర్లు, నర్సులు కలిసి మస్త్ గా ఎంజాయ్ చేశారు.. పాటలకు స్టెప్పులు వేస్తూ దుమ్ములేపారు.. అయితే.. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో వైద్యాధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే.. డిప్యూటీ సీఎం కూడా స్పందించి విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది.

Viral Video: ఇదేందయ్యా ఇది.. డాక్టర్లు, నర్సుల డ్యాన్స్‌తో దద్దరిల్లిన ఆస్పత్రి.. కట్ చేస్తే..!
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Nov 14, 2024 | 9:09 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. దీనదయాళ్ ఉపాధ్యాయ్ జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సులతో పాటు వైద్యులు డ్యాన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన నాలుగు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వైద్యులు, నర్సుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి, ఈ వ్యవహారం అంతా స్టాఫ్ నర్సుల ప్రమోషన్‌కు సంబంధించినది. నలుగురు స్టాఫ్ నర్సులకు పదోన్నతి వచ్చిన సందర్భంగా ప్రమోషన్ పార్టీ ఏర్పాటు చేశారు. అదికూడా ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు. ఇందులో సీఎంఎస్, ఎంఎస్, వైద్యులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా అందరూ హిందీ, భోజ్‌పురి పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఫుల్లుగా డిజే సౌండ్ పెట్టి.. స్టెప్పులతో హోరెత్తించారు..

డ్యూటీ డ్రెస్‌ ధరించిన వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది మెడలో జిల్లా ఆస్పత్రి గుర్తింపు కార్డులు వేసుకుని మరి డ్యాన్స్‌లు చేయడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం చేసే బదులు ఈ రకమైన డ్యాన్స్ పార్టీలు ఏంటంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి అధికార యంత్రాంగం నుంచి ప్రభుత్వం వరకు అందరూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

డిప్యూటీ సీఎం దృష్టికి..

జిల్లా ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు చేసిన డ్యాన్స్ వీడియోలను డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్‌ పాఠక్‌ తిలకించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందిస్తూ.. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర ఉద్యోగులు డ్యాన్స్ చేసి ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చడంపై మండిపడ్డారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని వారణాసి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించామని ఆయన చెప్పారు.

వారణాసి సిఎంఓ ఈ అంశంపై విచారణ జరిపి వారంలోగా నివేదికను పంపుతారని.. ఆ తర్వాత చర్యలుంటాయని డిప్యూటీ సిఎం చెప్పారు. ఆసుపత్రులు ఆరోగ్య దేవాలయాలని, ఇలా చేయడం తగదంటూ బ్రజేష్ పాఠక్ పేర్కొన్నారు.

దీపావళికి ముందు దీనదయాళ్ ఉపాధ్యాయ్ జిల్లా ఆసుపత్రిలో నలుగురు నర్సులకు ప్రమోషన్ లభించగా.. వారు పార్టీ నిర్వహించారు. వైరల్ అవుతున్న వీడియోలో, ఆసుపత్రి సిఎంఎస్ డాక్టర్ దిగ్విజయ్ సింగ్, ఎంఎస్ డాక్టర్ ప్రేమ్ ప్రకాష్, ఇతర వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సెమినార్ హాల్‌లో కూర్చుని ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..