AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి ఆరోగ్యానికి వరం లాంటివి.. చేపలు తినకుండానే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను చాలా ముఖ్యమైన పోషకాలుగా పరిగణిస్తారు.. శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే.. కొన్ని చేపలు, విత్తనాలు, గింజలు ఒమేగా-3లను పొందడానికి సహాయపడతాయి.. అయితే.. చేపలు తినని వారు శాకాహారం ద్వారా దీన్ని ఎలా పొందాలో ఈ కథనంలో తెలుసుకోండి..

ఇవి ఆరోగ్యానికి వరం లాంటివి.. చేపలు తినకుండానే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
Fish - Omega 3 Fatty Acids
Shaik Madar Saheb
|

Updated on: Nov 12, 2024 | 4:55 PM

Share

మన శరీరానికి అవసరమైన పోషకాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి.. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు, శరీర నిర్మాణానికి చాలా అవసరం.. ఒమేగా 3 రక్తపోటును తగ్గిస్తుంది, రక్తంలో ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది.. రుమటాయిడ్ వ్యాధిలో కీళ్ల వాపును తగ్గిస్తుంది.. మెదడు, కళ్ళ పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. చిత్తవైకల్యం, డిప్రెషన్, ఆస్తమా, మైగ్రేన్, మధుమేహాన్ని నివారించడంలో, తగ్గించడంలో సహాయపడుతుంది.. గుండె సమస్యలను ను నివారించడంలో సహాయపడుతుంది. అయితే.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని రకాల చేపలు, విత్తనాలు, గింజలు.. మీకు మరింత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందడానికి సహాయడతాయి..

సాధారణంగా.. సాల్మన్, మాకేరెల్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.. అయితే ప్రతి ఒక్కరికీ కొవ్వు చేపలను తినడం సాధ్యం కాదు.. కాబట్టి శాఖాహారం తినే వారు ఏమి చేయాలి..? ఈ పోషకాన్ని పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పొందగల శాఖాహార ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే శాఖాహారాలు..

సోయాబీన్: సోయాబీన్‌ను ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి తింటారు.. కానీ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి.. ఇది గుండెను రక్షించడంలో సహాయపడుతుంది.. ఎముకలు కూడా బలపడతాయి.

చియా విత్తనాలు: చియా విత్తనాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉత్తమ మొక్కల ఆధారిత వనరులలో ఒకటి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం.. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వాల్‌నట్: శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి శీతాకాలంలో వాల్‌నట్‌ను ఎక్కువగా తింటారు. ఇది ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌ల మధ్య అద్భుతమైన సమతుల్యతను అందిస్తుంది. వాల్‌నట్‌లను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అవిసె గింజలు: అవిసెగింజలను ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం.. అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. ఇది కాకుండా, జుట్టు, చర్మ సౌందర్యాన్ని ప్రోత్సహిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..