ప్రపంచ రికార్డు సృష్టించిన చీర.. సీఎం చేతుల మీదుగా, విశిష్టత తెలిస్తే అవాక్కే!

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో డానెక్స్ గార్మెంట్ ఫ్యాక్టరీకి చెందిన 300ల మంది మహిళా కార్మికులు రికార్డు సృష్టించారు. దంతేవాడకు చెందిన మహిళలు

ప్రపంచ రికార్డు సృష్టించిన చీర.. సీఎం చేతుల మీదుగా, విశిష్టత తెలిస్తే అవాక్కే!
World Record

Updated on: May 27, 2022 | 9:53 PM

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో డానెక్స్ గార్మెంట్ ఫ్యాక్టరీకి చెందిన 300ల మంది మహిళా కార్మికులు రికార్డు సృష్టించారు. దంతేవాడకు చెందిన మహిళలు 11 కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దంతేవాడలోని డెనెక్స్​ అనే టెక్స్​టైల్​ ఫ్యాక్టరీకి చెందిన మహిళలు ఈ వస్త్రాన్ని రూపొందించారు. దంతెవాడ రోడ్లపై దంతేశ్వరి అమ్మవారి మహా చునారీనీ ప్రదర్శించారు.

ప్రత్యేకంగా రూపొందించిన ఈ వస్త్రానికి శోభాయత్ర నిర్వహించారు. 300 మంది మహిళలు కేవలం ఏడు రోజుల్లో రూపొందించిన ఈ వస్త్రాన్ని దంతేవాడ పట్టణంలో 11 కిలోమీటర్లు ఊరేగించారు. ఇది చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మంగళవారం.. దంతేవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి భుపేశ్​ భఘేల్​ ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, గతంలో మధ్యప్రదేశ్​లోని మందసూర్​ నర్మదా మైయా ఆలయానికి అక్కడి ప్రజలు ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని సమర్పించారు. తాజాగా వారి రికార్డ్‌ను బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పారు దంతెవాడ మహిళలు.. గోల్డెన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లో దీనికి చోటు దక్కింది. దంతేశ్వరి మహా చునారీ 11 కిలోమీటర్ల పొడవు కావడంతో ఈ చీరకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కింది.

Follow Us