Viral Photo: ఈ చిన్ని పాప ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ.. మీరు గుర్తుపట్టగలరా..?
ఆమె ఒక సంచలనం.. ఆమె జీవితం ఒక పాఠం.. ఆమె ప్రయాణం ఒక ప్రత్యేక అధ్యాయం. ఆ క్రీడకు ఒకప్పుడు అంతగా ఆదరణ లేదు.. అసలు పట్టించుకునే నాధుడే లేడు.. అందులో అడుగుపెడితే.. భవిష్యత్‌కు భరోసా ఉంటుందన్న ఆశ లేదు. అలాంటి సమయంలో దాన్నే కెరీర్‌గా ఎంచుకుని మిరాకిల్స్ చేసింది.

ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఎక్కువగా కనిపిస్తున్నది త్రో బ్యాక్ పిక్స్. అప్పడు – ఇప్పుడు అంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు నెటిజన్స్. సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్ గట్టిగానే ఫాలో అవుతున్నారు. తమ చిన్ననాటి ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. అభిమానులు వాటిని వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా మీ ముందుకు మాజీ ఇండియన్ స్పోర్ట్ స్టార్ ఫోటోను తీసుకొచ్చాం తనెవరో మీరు గుర్తుపట్టగలరా..? ఎన్నో ఆటంకాలు.. అద్భుత పోరాటాలు.. తను గెలుస్తూ.. ఎందరికో స్ఫూర్తి నింపుతూ.. సాగింది ఈమె కెరీర్. తనెవరో కాదు.. రెండు దశాబ్దాల పాటు ఇండియా తరఫున టెన్నిస్ ఆడిన సానియా మీర్జా.
సానియా బర్త్ ప్లేస్ ముంబై అయినప్పటికీ.. అమె ఎదిగింది అంతా హైదరాబాద్‌లో. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పోర్ట్స్ జర్నలిస్ట్ కాగా.. తల్లి నసీమా ప్రింటింగ్‌కు సంబంధించిన బిజినెస్ నిర్వహించేది. ఆరేళ్ల వయసులోనే టెన్నిస్‌కు ఆకర్షితురాలైన సానియాకు.. తండ్రి ఇమ్రానే ఆదిగురువు. సింగిల్స్‌లో అడుగుపెట్టిన సానియా.. ఆ తర్వాత డబుల్స్‌కు మారింది. ప్రపంచ మహిళల డబుల్స్‌లో నెంబర్‌వన్ ర్యాంక్ సాధించింది. మూడు డబుల్స్, మూడు మిక్స్‌డ్ గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు ఆసియా క్రీడల్లో ఎనిమిది టైటిళ్లు గెలిచింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండు పతకాలు ఆమె ఖాతాలో వేసుకుంది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు సాధించింది.
36 ఏళ్ల సానియా మీర్జా.. 2003లో టెన్నిస్ లోకి అడుగుపెట్టింది. తన కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకుంది. మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ గెలవగా.. వాటిలో రెండు మహేష్ భూపతితో కలిసి గెలిచింది. 2009లో ఆస్ట్రేలియన్.. 2012లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గింది. 2004లో అర్జున, 2015లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులను దక్కించుకున్న సానియా.. పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా పొందింది. తరచూ గాయాలు కావడం, సరైన ఫామ్ లేకపోవడంతో ఆటకు అల్విదా చెప్పింది సానియా.
సానియా లైఫ్‌లో గేమ్‌తో పాటు వివాదాలు కూడా భాగమైపోయాయి. చిన్న, చిన్న దుస్తులతో ఆడటం తమ ఆచారాలకు విరుద్ధమంటూ సానియా కెరీర్ ఆరంభంలో కొందరు మత పెద్దలు ఆమెపై ఫత్వా జారీ చేశారు. అలానే.. పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకోవడంతో సానియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరే క్రీడాకారిణి ఎదుర్కోని అవమానాలు, అడ్డంకులను చవిచూసినా.. వాటిని అంతేదీటుగా అధిగమించింది. తాను కలలుగన్న జీవితం కోసం పోరాడి గెలిచింది.
ఇవాళ ఇండియాలో టెన్నిస్‌కి ఈ స్థాయిలో క్రేజ్ ఉందంటే.. అందుకు పునాది వేసిన వాళ్లలో సానియా ఒకరు. విమర్శలకు వెరవని నైజం.. ఒడిదొడుకులకు తలవంచని ధైర్యంతో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకొన్న సానియా.. ఎంతో మంది భవిష్యత్ క్రీడాకారులకు రోల్‌మోడల్.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
