అమ్మో బాబోయ్..డ్రైవింగ్ లైసెన్స్ కోసం 960 సార్లు పరీక్ష రాసిన మహిళ
ఎవరైన వెహికిల్ కొనుక్కున్నాక డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొంతవరకు తిప్పలు పడటం మాములే. అయితే ఓ మహిళ మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి నానా తంటాలు పడింది.
ఎవరైన వెహికిల్ కొనుక్కున్నాక డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొంతవరకు తిప్పలు పడటం మాములే. అయితే ఓ మహిళ మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి నానా తంటాలు పడింది. పరీక్షలో ప్రతిసారి ఫెలైనా… ఫీజుల రూపంలో మళ్లీ డబ్బులు ఖర్చవుతున్నా ఆమె వెనకడుగు వేయలేదు. చివరకు 960 సార్లు ప్రయత్నించిన తర్వాత తాను కోరుకున్న డ్రైవింగ్ లైసెన్స్ ను దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే దక్షిణ కొరియాకు చెందిన చాసా-సూన్ అనే మహిళ డ్రైవింగ్ లైసెన్స్ కోసం తొలిసారిగా 2005 లో పరీక్ష రాసింది. కానీ అందులో విఫలమైంది. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి వారానికి ఐదురోజుల చొప్పున మూడేళ్లలో 780 సార్లు పరీక్ష రాసింది. అయినా ఆమెకు నిరాశే ఎదురైంది.
అయినప్పటికీ ఆమె తన పట్టు విడవలేదు. ఈసారి వారానికి రెండుసార్లు చొప్పున ఏడాదిన్నరకు పైగా పరీక్షలు రాసింది. చివరికీ ప్రాక్టికల్ టెస్టుకు ఎంపికైంది. మళ్లీ అక్కడ కూడా పదిసార్లు ప్రయత్నించి ప్రాక్టికల్ టెస్టులో పాసైంది. మొత్తంగా చూసుకుంటే 960 సార్లు ప్రయత్నించిన తర్వాత 2010లో ఆమె డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. అప్పటికీ ఆమె వయసు 69 ఏళ్లు. ఈ క్రమంలోనే లైసెన్స్ కోసం సుమారు రూ. 11.16 లక్షలు ఖర్చు చేసింది. వెనకడుగు వేయకుండా సంకల్పంతో ముందుకెళ్లిన చాసా-సూన్ ను గర్తించిన హ్యిుండాయ్ సంస్థ ఓ కారును ఆమెకు బహుమతిగా ఇచ్చింది. ఇది 18 ఏళ్ల కిందటి విషయమే అయినా ఇటీవల ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అయ్యింది. ఆమె చేసిన పని ఎంతో స్పూర్తిదాయకం అంటూ నెటీజన్లు కూడా తమ అభిప్రయాలు పంచుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..