AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కట్టెలకు వెళ్లిన మహిళ మిస్సింగ్.. కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పొట్ట చీల్చి చూడగా

కట్టెలకు వెళ్లిన మహిళ మిస్సింగ్.. రాత్రి అయినా సరే.. ఆమె ఇంటికి చేరలేదు. దీంతో కంగారు పడిన కుటుంబీకులు ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆమె వెళ్లిన ప్రాంతానికి వెళ్తే.. ఎక్కడా కనిపించలేదు. దీంతో అక్కడ ఓ కొండచిలువ పొట్ట ఉబ్బిపోయి కనిపించింది.

Viral: కట్టెలకు వెళ్లిన మహిళ మిస్సింగ్.. కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పొట్ట చీల్చి చూడగా
Telugu
Ravi Kiran
|

Updated on: Jun 24, 2025 | 7:08 PM

Share

ఇండోనేషియాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. కట్టెలు కోసం వెళ్లిన 66 ఏళ్ల హసియా అనే మహిళ.. 26 అడుగుల కొండచిలువ పొట్టలో కనిపించింది. ఉదయాన్నే కట్టెల కోసం అడవికి వెళ్లిన హసియా.. రాత్రి 9 గంటలు అయినప్పటికీ ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఆమె కుటుంబీకులు వెతకసాగారు. వారికి ఓ చోట గడ్డిపై కొండచిలువ ఉబ్బిపోయిన పొట్టతో మెలికలు తిరుగుతూ కనిపించింది. వెంటనే దాన్ని స్థానికుల సాయంతో పట్టి.. పొట్ట చీల్చి చూడగా.. 66 ఏళ్ల హసియా మృతదేహం బయటపడింది.

హసియా కాలికి చుట్టుకుని.. ఆమెను పడేసి.. మెడను బిగించి.. మింగేసి ఉండొచ్చునని స్థానికులు నమ్ముతున్నారు. దాని పట్టు నుంచి తప్పించుకోవడానికి హసియా చాలా కష్టపడిందని.. పూర్తిగా మింగేటప్పుడు ఊపిరి ఆడక మరణించి ఉండొచ్చునని పేర్కొన్నారు. కట్టెలకు వెళ్లిన ఆమె.. రాత్రి పడినా రాకపోవడంతో.. ఆందోళన చెందిన కుటుంబం వెతుకులాట ప్రారంభించిందని.. ఆమె వెళ్లిన ప్రాంతాన్ని బాగా వెతికినా దొరక్కపోవడంతో.. అక్కడే గడ్డిపై పడి ఉన్న సరీసృపాన్ని కోసి చూడగా.. దాని కడుపులో హసియా మృతదేహం కనిపించింది. పైథాన్‌ను పట్టుకుని.. చంపేసినా.. తమకు ఓదార్పు రాలేదని.. చనిపోయిన తన తల్లి తిరిగి రాదని తెలిసి చాలా బాధపడినట్టు పేర్కొన్నాడు ఆమె కుమారుడు. కాగా, ఇండోనేషియాలో గత కొంతకాలంలో ఇలాంటి మరణాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..