Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో ఆదర్శ గ్రామం.. డీజే, మందు లేకుండా పెళ్లిళ్లు చేస్తే భారీ బహుమతి..! ఎక్కడంటే..

సాధారణంగా గ్రామాల్లో మద్యం సరఫరా చేయడం, డిస్క్ జాకీల ద్వారా పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేయడం చూస్తుంటాం. వాటితో గొడవలు జరుగుతుంటాయని అన్నారు. అంతే కాకుండా పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చేలా పాటలు ప్లే చేయడం వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని భావించిన ఆ గ్రామ పంచాయతీ ఎవరూ చేయని విధంగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందుకే మద్యం సేవించని కుటుంబానికి, వివాహ వేడుకల్లో డీజే లేకుంటే..

ఇదో ఆదర్శ గ్రామం.. డీజే, మందు లేకుండా పెళ్లిళ్లు చేస్తే భారీ బహుమతి..! ఎక్కడంటే..
Ballo Village Panchayat
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 09, 2025 | 1:29 PM

దేశంలోని చాలా చోట్ల వివాహాల్లో మద్యం, డీజే వాడకం చాలా సాధారణం. కానీ, పంజాబ్‌లోని ఒక గ్రామంలో మాత్రం వీటిపై ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని బటిండా జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బల్లో గ్రామ సర్పంచ్ అమర్‌జీత్ కౌర్ తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివాహ వేడుకల్లో డీజే, మద్యం వాడ‌ని కుటుంబాలకు రూ.21 వేలు నగదు బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. గ్రామంలోని ప్రజలు వివాహ వేడుకలకు వృధా ఖర్చు చేయకుండా, మద్యం సేవించడం, వడ్డించడం అనే సంస్కృతిని ప్రోత్సహించకుండా ఉండటానికి ఈ చర్య తీసుకున్నట్లు అమర్‌జిత్ కౌర్ తెలిపారు. ఈ విషయంలో పంచాయతీ అధికారికంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

సాధారణంగా గ్రామాల్లో మద్యం సరఫరా చేయడం, డిస్క్ జాకీల ద్వారా పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేయడం చూస్తుంటామ‌ని బల్లో గ్రామ సర్పంచ్ అమర్‌జీత్ కౌర్ అన్నారు. వాటితో గొడవలు జరుగుతుంటాయని అన్నారు. అంతే కాకుండా పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చేలా పాటలు ప్లే చేయడం వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని సర్పంచ్ అమర్జీత్ కౌర్ తెలిపారు. పెళ్లి వేడుకల్లో వృథా ఖర్చు చేయకుండా ప్రోత్సహించాలన్నారు. అందుకే మద్యం సేవించని కుటుంబానికి, వివాహ వేడుకల్లో డీజే ఆడకుంటే రూ.21 వేలు ఇస్తామని పంచాయతీ తీర్మానం చేసిందని గ్రామ సర్పంచ్ తెలిపారు.

కౌర్‌ మాట్లాడుతూ.. బల్లో గ్రామ జనాభా సుమారు 5,000. యువత క్రీడల్లో పాల్గొనేలా గ్రామంలో స్టేడియం నిర్మించాలని గ్రామ పంచాయతీ యోచిస్తున్నట్టుగా చెప్పారు. గ్రామంలో వివిధ క్రీడలు నిర్వహించేందుకు వీలుగా స్టేడియం ఉండాలని సర్పంచ్ తెలిపారు. దీనితో పాటు, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఉచిత విత్తనాలు కూడా ఇస్తామని చెప్పారు. అంతేకాదు. గ్రామంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని పంచాయతీ ప్రతిపాదించిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి