Wedding Card: హాట్ టాపిక్‌గా మారిన పెళ్లి పత్రిక.. అతిథులు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది. వివాహం ఫిబ్రవరి 9, 2025న జైపూర్‌లో జరుగుతుంది. ఈ కార్డు ఇతర కార్డుల మాదిరిగా సాధారణమైనది కాదు. ఆ కార్డుపై రాసి ఉన్నది చూసిన అతిథులు షాక్ అవుతున్నారు. వైరల్ అవుతున్న కార్డుపై నెటిజన్లు రకరకాలుగా కామంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో చాలా వివాహాలు జరిగాయి. మాఘ మాసం రాకతో.. కల్యాణ మండపాల్లో కళకళలాడడం మొదలైంది. రెండున్నర నెలల విరామం తర్వాత మళ్లీ వివాహ ముహుర్తాలు రావడంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లి..ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్వీట్ మెమరీ. వెడ్డింగ్ కార్డ్ మొదలుకొని పెళ్లి మంటపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటాం. లేటెస్ట్‌గా గుజరాత్‌లో తన కొడుకు పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు వరుడి తండ్రి. దాన్ని చదివిన తర్వాత షాక్ అయ్యారు అతిథులు. ఇప్పుడీ ఇన్విటేషన్ కార్డే అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవలే ఫైక్ అతీక్ కిద్వాయ్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఒక వివాహ కార్డు పోస్ట్ చేయడం జరిగింది. ఈ వివాహం ఫిబ్రవరి 9, 2025న జరుగుతుంది. వివాహం జైపూర్‌లో జరుగుతోంది. కార్డులోని “అమద్ కే ముంతజీర్” అనే కార్యక్రమంపై అందరి దృష్టి కేంద్రీకరించారు. హిందీలో దీని అర్థం, “చూడాలనే కోరిక”. జనరల్‌గా శుభలేఖపై ముఖ్యమైన రెండు మూడు కుటుంబాల పేర్లు వేయిస్తుంటాం. కానీ ఇది బాహుబలి వెడ్డింగ్ కార్డ్. ఒకటి..రెండు కాదు..పదుల సంఖ్యలో కుటుంబాల పేర్లతో శుభలేఖను అచ్చు వేయించారు. అంతేకాదు చనిపోయిన వారి పేర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.
ఈ వివాహ కార్డులో, ఉద్దేశించిన అతిథుల పేర్లకు బదులుగా మరణించిన వారి పేర్లు చేర్చారు. ఆ కార్డు మీద ఇలా రాసి ఉంది. దివంగత నూరుల్ హక్, దివంగత లాలూ హక్, దివంగత బాబు హక్, దివంగత ఎజాజ్ హక్, ఆపై ఇతరుల పేర్లు రాశారు. జైపూర్‌లోని కర్బాలా మైదానంలో వివాహం జరిగింది. ఆ కార్డులో ఫిబ్రవరి 8 – 9 తేదీలలో జరిగే కార్యక్రమం గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 600 మందికి పైగా దీన్ని లైక్ చేశారు. 100 మందికి పైగా కామెంట్స్ చేశారు. జోధ్‌పూర్, జైపూర్ ప్రాంతాల్లో ఇటువంటి కార్డులు సర్వసాధారణమని ఒక వ్యక్తి రాసుకొచ్చాడు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..