AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాసేపట్లో పెళ్లి.. వధువు జంప్.. పోలీస్ స్టేషన్‌కు చేరిన సీన్.. అసలేం జరిగిందంటే..!

జనవరి 22న వధూవరుల కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. గత ఆదివారం బసంత్ పంచమి సందర్భంగా వారి వివాహం చాలా వైభవంగా జరిగింది. వరుడు, అతని బంధుమిత్రులు ముందుగానే వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. అందరూ వధువు కోసం ఎదురు చూస్తున్నారు. నిమిషాలు గంటలుగా గడిచాయి. కానీ, వధువు వివాహ వేదిక మీదకు రాలేదు. ముందు రోజు రాత్రి వరకు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది.

కాసేపట్లో పెళ్లి.. వధువు జంప్.. పోలీస్ స్టేషన్‌కు చేరిన సీన్.. అసలేం జరిగిందంటే..!
Bride Escape
Jyothi Gadda
|

Updated on: Feb 09, 2025 | 1:07 PM

Share

భారతీయ సాంప్రదాయ వివాహాలలో అమ్మాయికి వరుడిని వెతికి నిర్ణయించేది కుటుంబ సభ్యులే. దాదాపుగా అమ్మాయి ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోరు. అలాంటి వివాహాల్లో అమ్మాయి వివాహానికి ముందు లేదా తర్వాత తన ప్రేమికుడితో పారిపోయిన ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. లేదంటే, తల్లిదండ్రుల మీద గౌరవంతో ఇష్టంలేని వివాహంతో అసంతృప్తికరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతుంది. ఇటీవల రాజస్థాన్‌లోని బుండి జిల్లా నైన్వాన్ పట్టణంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…

జనవరి 22న వధూవరుల కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. గత ఆదివారం బసంత్ పంచమి సందర్భంగా వారి వివాహం చాలా వైభవంగా జరిగింది. వరుడు, అతని బంధుమిత్రులు ముందుగానే వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. అందరూ వధువు కోసం ఎదురు చూస్తున్నారు. నిమిషాలు గంటలుగా గడిచాయి. కానీ, వధువు వివాహ వేదిక మీదకు రాలేదు. ముందు రోజు రాత్రి వరకు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది. రాత్రి అందరూ కలిసి భోజనం చేసి నిద్రపోయారు. కానీ, ఉదయం లేచి చూసేసరికి ఆ ఇంట్లో ఎవరికీ వధువు కనిపించలేదు. చుట్టుపక్కల గాలించారు. తెలిసిన వారందరినీ ఆరా తీశారు.. చివరకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

వధువు తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అటు, వరుడి తండ్రి, కుటుంబ సభ్యులు కూడా నైన్వాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వధువు చేసిన పనితో వరుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తులో గత రాత్రి ఇంట్లో నిద్రించిన వధువు ఉదయం తన ప్రేమికుడితో పారిపోయిందని తేలింది. దాంతో చేసేది లేక వరుడు, అతని కుటుంబం తిరిగి వెళ్లిపోయారు. కానీ, గ్రామానికి చెందిన ఒక యువకుడు తన కూతురిని కిడ్రాప్‌ చేశాడని ఆరోపిస్తూ వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి