19 ఏళ్లుగా ఆమె అక్కడే జీవిస్తోంది.. ఇంతకీ ఎక్కడో తెలుసా?

అన్నపానీయాలు అక్కడే.. మలమూత్రాలు కూడా అక్కడే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రోజుకు ఎంతమందో లెక్కలేదు. ఇదొక అమానవీయ సంఘటన. 65ఏళ్ళ వృద్ధురాలు 19ఏళ్లుగా పబ్లిక్ టాయిలెట్‌నే తన నివాసంగా చేసుకుని బతుకుంది. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు మధురైలో జరిగింది. కురుప్పాయ్( 65) అనే వృద్ధురాలు గత 19 ఏళ్లుగా పబ్లిక్ టాయిలెట్‌లోనే నివసిస్తోంది. ప్రకృతి అవసరాలకోసం పబ్లిక్‌ టాయిలెట్‌ ఆమెకు నివాసంగా మారింది. మధురైలోని రాంనాథ్ ప్రాంతంలో కురుప్పావై నివసిస్తోంది. ఆమెకు ఒక కుమార్తె […]

19 ఏళ్లుగా ఆమె అక్కడే జీవిస్తోంది.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 6:08 AM

అన్నపానీయాలు అక్కడే.. మలమూత్రాలు కూడా అక్కడే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రోజుకు ఎంతమందో లెక్కలేదు. ఇదొక అమానవీయ సంఘటన. 65ఏళ్ళ వృద్ధురాలు 19ఏళ్లుగా పబ్లిక్ టాయిలెట్‌నే తన నివాసంగా చేసుకుని బతుకుంది. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు మధురైలో జరిగింది.

కురుప్పాయ్( 65) అనే వృద్ధురాలు గత 19 ఏళ్లుగా పబ్లిక్ టాయిలెట్‌లోనే నివసిస్తోంది. ప్రకృతి అవసరాలకోసం పబ్లిక్‌ టాయిలెట్‌ ఆమెకు నివాసంగా మారింది. మధురైలోని రాంనాథ్ ప్రాంతంలో కురుప్పావై నివసిస్తోంది. ఆమెకు ఒక కుమార్తె ఉన్నప్పటికీ.. తన తల్లి టాయిలెట్‌లో నివసిస్తుండటంతో ఎన్నడూ కనీసం చూసేందుకు కూడా రాదని కురుప్పాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.

గత 19 సంవత్సరాలనుంచి ఆమె ఇదే టాయిలెట్‌లో బతుకీడుస్తున్న విషయం స్ధానికంగా చాలామందికి తెలుసు. కానీ ఎవ్వరూ ఆమెను పలకరించిన పాపాన పోలేదు. తనకు వృద్ధాప్య పింఛన్ కావాలని అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా ఏ ఒక్క అధికారి తనను పట్టించుకోలేదని తన బాధను వ్యక్తం చేసింది. తనకు సరైన నిలువ నీడలేక ఈ విధంగా పబ్లిక్ టాయిలెట్‌లో నివసిస్తున్నానని చెప్పినా ఎవ్వరూ సాయం చేయలేని చెబుతోంది.

ఇన్నేళ్లుగా కురుప్పాయ్ పబ్లిక్ టాయిలెట్‌కి వచ్చిన వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకుని ఆ టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ బతుకీడుస్తోంది. ఆమె ప్రతిరోజు ఇలా క్లీనింగ్ ద్వారా 60 నుంచి 70 రూపాయలు సంపాదించుకుని అక్కడే వంట చేసుకుని అక్కడే బతుకుతుంది. తన పరిస్థితి చూసి ఎవ్వరికైనా జాలి కలగకపోతుందా? తనకు ఓ దారి చూపకపోతారా అని ఇప్పటికీ ఎదురుచూస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికైనా తమిళనాడు ప్రభుత్వం, మధురై స్ధానిక నేతలు , అధికారులు కురుప్పావైకు ఉండేందుకు నివాసం ఏర్పాటు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.