Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని పక్షులు ఉన్నాయో చెప్పగలరా.? కొంచెం కష్టమే.! కనిపెట్టండి..

ఫోటో పజిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని ఇష్టపడేవారు కూడా చాలామంది ఉన్నారు...

Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని పక్షులు ఉన్నాయో చెప్పగలరా.? కొంచెం కష్టమే.! కనిపెట్టండి..
Bird
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 06, 2022 | 12:54 PM

ఫోటో పజిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని ఇష్టపడేవారు కూడా చాలామంది ఉన్నారు. తమ మెదడుకు మేత వేస్తూ.. కళ్లకు పదును పెట్టి ఇలాంటి పజిల్స్‌ను ఓ పట్టు పట్టేస్తారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్‌కు ప్రత్యేకంగా పేజీలు కూడా పెట్టారు. కొన్నిసార్లు పాత ఫోటో పజిల్స్ సైతం మరోసారి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడతాయి. ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పైన ఫోటోలో ఎన్ని పక్షులు ఉన్నాయో కనిపెట్టండి చూద్దాం. చూసేందుకు అదొక నరికేసిన చెట్టు కాండంలా ఉంది కదూ. ఇక దాని పక్కనే ఓ పక్షి ఉంది.. సమాధానం ఒకటి అని అనుకుంటే పొరపాటే. ఈ పజిల్ చాలామంది సాల్వ్ చేశారు. ఈజీగా అందులో ఎన్ని పక్షులు ఉన్నాయో కనిపెట్టేశారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటో చూడండి.

ఇదిలా ఉంటే.. మనల్ని మభ్యపెట్టే పక్షులు ఈ భూప్రపంచంలో చాలానే ఉన్నాయి. అందులో ఒకటే పోటూ పక్షి. ఇది చూడటానికి నరికేసిన చెట్టు కాండంలా కనిపిస్తుంది. దీని శరీరం, ఈకలు.. అన్ని కూడా ఎండిపోయిన కర్రలా ఉంటాయి. ఇంకో విశేషమేంటంటే.. ఈ పక్షి ఎప్పుడూ కూడా ఎండిన చెట్లపైనే వాలుతుంది. ఈ పక్షికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.