Viral Video: గుర్రాన్ని వెంబడించిన పిట్‌బుల్ డాగ్…! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..
పెంపుడు కుక్కల దాడిలో వ్యక్తులు మరణించిన ఘటనలు కూడా అనేకం చూశాం. అయితే, పెంపుడు కుక్కల వల్ల మనుషులకే కాకుండా జంతువులను కూడా అవి వేటాడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రెండు గుర్రాలను ఓ పెంపుడు వెంటాడింది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే...

చాలా మంది ఇళ్లల్లో పెంపుడు కుక్కలు ఉండటం సాధారణమే. అయితే, పెంపుడు కుక్కల పట్ల యాజమానులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే వాటివల్ల ఎదుటి వారు ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది. కానీ, కొందరు మాత్రం వాటిని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా విచ్చలవిడిగా వదిలేస్తుంటారు. దీంతో అవి బయటకు వచ్చి రోడ్డుపై వెళ్తున్నవారిని ఎటాక్ చేస్తుంటాయి. పెంపుడు కుక్కల దాడిలో వ్యక్తులు మరణించిన ఘటనలు కూడా అనేకం చూశాం. అయితే, పెంపుడు కుక్కల వల్ల మనుషులకే కాకుండా జంతువులను కూడా అవి వేటాడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రెండు గుర్రాలను ఓ పెంపుడు వెంటాడింది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…
వైరల్ వీడియోలో రెండు గుర్రాలు రోడ్డు గుండా వెళ్తున్నాయి. అంతలోనే ఒక ఇంటి గెటు తెరుచుకుంటుంది. అందులోంచి పిట్‌బుల్ జాతికి చెందిన ఒక పెంపుడు కుక్క బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ గుర్రాలలో ఒకదాని వెంట పరుగెత్తుతుంది. దాంతో ఆ గుర్రం భయపడి అదుపు తప్పి వేగంగా పరిగెత్తడం ప్రారంభిస్తుంది. కుక్క గుర్రాన్ని ఎంత వేగంగా వెంబడించిందంటే, తనను తాను రక్షించుకోవడానికి ఆ గుర్రం ఎదురుగా ఆగివున్న కారుపైకి దూకింది. అయినా ఆ కుక్క గుర్రాన్ని విడిచిపెట్టలేదు.
వీడియో ఇక్కడ చూడండి..
Kalesh b/w Dogesh and Ghodesh: pic.twitter.com/9FKLdzmuCN
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 23, 2025
కారుకు ఎదురుగా వెళ్లిన పిట్‌బుల్ గుర్రంపై దాడికి యత్నించింది. దాంతో గుర్రం ఎదురు తిరిగింది. పిట్‌బుల్‌ను బలంగా తోసి నేలపై పడవేస్తుంది. ఇద్దరి మధ్య భీకర యుద్ధమే జరిగింది. ఈ మొత్తం సంఘటన సీసీటీవీలో రికార్డైంది. దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో @gharkekalesh అనే X పేజీ నుండి షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




